E-Paper
Advertisement

సముద్రపు ఒడ్డున సయ్యాట… పాత ప్రేయసి రాకతో హీరో గుండెల్లో అలజడి… టాప్ రేటింగ్ తో అదరగొడుతున్న సిరీస్

సముద్రపు ఒడ్డున సయ్యాట… పాత ప్రేయసి రాకతో హీరో గుండెల్లో అలజడి… టాప్ రేటింగ్ తో అదరగొడుతున్న సిరీస్
Advertisement

Romantic Series on OTT : ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంతో కూడిన ప్రేమ కథ కావాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే కొరియన్ రొమాంటిక్ సిరీస్ ను చూడాల్సిందే. సిటీ లైఫ్ ఒత్తిడిలో పడి అన్నీ కోల్పోయిన ఒక అమ్మాయి, తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడి మనుషుల ప్రేమాభిమానాలు, ప్రకృతి అందాలు ఆమె జీవితంలో ఆనందాన్ని ఎలా మళ్ళీ నింపాయనేది ఇందులో చాలా అందంగా చూపిస్తారు. పాత ప్రేమ, విడదీయలేని స్నేహం, కుటుంబ బంధాల చుట్టూ తిరిగే ఈ కథ చూస్తున్నంత సేపు మనకు చాలా ప్రశాంతంగా, మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఇలాంటి కంటెంట్ తో కొరియన్ డ్రామాలు చాలానే ఉన్నా, ఇది మాత్రం మన ఊరిలో మనం ఉన్నట్లు అనిపించేలా చేస్తుంది. దీనికి ఐయండిబిలో ఎనిమిదికి పైగా రేటింగ్ కూడా ఉందంటే కథలో ఎంత దమ్ము ఉందో తెలుస్తోంది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2023లో వచ్చిన ఒక అందమైన కొరియన్ డ్రామా ‘వెల్‌కమ్ టు సమడాల్రి’ (Welcome to Samdal-ri). ఇందులో జి చాంగ్-వుక్, షిన్ హ్యే-సన్ ప్రధాన పాత్రలు పోషించారు. డ్రామాలో చూపించిన జేజు ఐలాండ్ అందాలు మామూలుగా ఉండవు. ఈ సిరీస్ క్లైమాక్స్ వచ్చేసరికి కొరియాలో విపరీతమైన రేటింగ్స్ సాధించి, అక్కడి టాప్ డ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇక సంగీతం విషయానికి వస్తే, ఇందులో పాటలు వినడానికి చాలా హాయిగా ఉంటాయి. ముఖ్యంగా ‘సెవెంటీన్’ గ్రూప్‌కు చెందిన డికె (DK) పాడిన పాటలు కుర్రకారును బాగా ఆకట్టుకున్నాయి. ఈ డ్రామాకి పని చేసిన దర్శకుడు ఇదివరకు ‘వెన్ ద కెమెల్లియా బ్లూమ్స్’ లాంటి హిట్ డ్రామాలను తీసిన ఆయనే కావడం విశేషం. అందుకే ఇందులో పల్లెటూరి మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ ను కళ్లకి కట్టినట్లు చూపించారు.16 ఎపిసోడ్స్‌లో హీరో హీరోయిన్ల చిన్నప్పటి జ్ఞాపకాలు, వాళ్ళు విడిపోవడానికి గల కారణాలు, తిరిగి ఎలా దగ్గరయ్యారనే విషయాలను దర్శకుడు చాలా హార్ట్ టచింగ్ గా చూపించారు. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

జో సామ్-డాల్ అనే అమ్మాయి సమడాల్రి అనే చిన్న పల్లెటూరు నుండి సిటీకి వెళ్లి, తన కష్టంతో పెద్ద ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవుతుంది. కానీ అక్కడ తన దగ్గర పనిచేసే ఒక అమ్మాయి కుట్ర వల్ల సామ్ డాల్ మీద ఒక నింద పడుతుంది. జనం అంతా తనని తిడుతుంటే, తట్టుకోలేక ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే తన సొంతూరైన సమడాల్రికి వచ్చేస్తుంది. అక్కడ తన చిన్నప్పటి స్నేహితుడు, పాత ప్రేమికుడు అయిన జో యంగ్-పిల్ ఎదురవుతాడు. అసలు సామ్-డాల్, యంగ్-పిల్ ఇద్దరూ ఒకే రోజు, ఒకే ఊర్లో పుడతారు. చిన్నప్పటి నుండి ప్రాణంగా పెరిగిన వీళ్లు పెద్దయ్యాక ప్రేమించుకుంటారు. కానీ సడన్‌గా సామ్-డాల్ అతనికి బ్రేకప్ చెప్పి సిటీకి వెళ్లిపోతుంది. యంగ్-పిల్ మాత్రం తనని మర్చిపోలేక, తన ఊరిలోనే వాతావరణ శాఖలో పనిచేస్తూ ఆమె కోసం ఎదురుచూస్తుంటాడు.

నిజానికి వీళ్లిద్దరూ విడిపోవడానికి కారణం యంగ్-పిల్ తండ్రి. ఒకప్పుడు జరిగిన ప్రమాదంలో యంగ్-పిల్ తల్లి చనిపోవడానికి సామ్-డాల్ తల్లే కారణమని ఆయన ఈ జంటను విడదీస్తాడు. ఆ ఊర్లో అందరూ సామ్-డాల్‌ని తప్పు పడుతున్నా, యంగ్-పిల్ మాత్రం ఆమె వెంటే ఉండి ధైర్యం చెప్తాడు. ఆమె మళ్ళీ కెమెరా పట్టుకునేలా ప్రోత్సహిస్తాడు. ఈ క్రమంలోనే పెద్దల మధ్య ఉన్న పాత పగలు తొలగిపోతాయి. యంగ్-పిల్ తండ్రి కూడా తన తప్పు తెలుసుకుని వీళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు. చివరకు సామ్-డాల్ తనపై పడ్డ నిందను పోగొట్టుకుని, తిరిగి సిటీకి వెళ్లకుండా తన ఊర్లోనే తనకి నచ్చిన పని చేస్తూ, తన మనసు మెచ్చిన వాడితో సంతోషంగా ఉండటంతో కథ ముగుస్తుంది.

Advertisement

Read Also : గర్భవతుల్నే టార్గెట్ చేసి ఘోరంగా చంపే సైకో… ఒక్కో సీన్ కు వణుకు పుట్టాల్సిందే

Tags

Related News

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

Big Stories

Advertisement
×