E-Paper
Advertisement

Prabhas: ఏం క్లారిటీ గురూ.. టాలీవుడ్ డైరెక్టర్స్ పై ప్రభాస్ ఒపీనియన్!

Prabhas: ఏం క్లారిటీ గురూ.. టాలీవుడ్ డైరెక్టర్స్ పై ప్రభాస్ ఒపీనియన్!

Prabhas:రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు.. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఆ తర్వాత అన్ని వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు. ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు కానీ వాటి ఫలితాలతో సంబంధం లేకుండా కలెక్షన్లను రాబడుతూ నిర్మాతలకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్..

ఇదిలా ఉండగా తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్. మారుతీ దర్శకత్వంలో హారర్ కామెడీ రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. అటు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాదులో నిన్న ఘనంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ 6 నిర్వహించారు. సాధారణంగా పబ్లిక్ ముందుకు బహిరంగ సభలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించని ప్రభాస్ దాదాపు మూడేళ్ల తర్వాత పబ్లిక్ ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందులో స్టైలిష్ గా.. పిలక జుట్టు.. గుబురు గడ్డంతో కనిపించి అమ్మాయిలను సైతం ఆకట్టుకున్నారు.

దర్శకులపై ఒక్క మాటలో..

ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ ను సుమా కొన్ని ప్రశ్నలు అడిగింది. మీరు పని చేసిన దర్శకుల గురించి ఒక్కమాటలో చెప్పాల్సిందిగా కోరడంతో అందుకు ప్రభాస్ ఒక్కో దర్శకుడి గురించి ఒక్క మాటలో చెప్పి దర్శకులపై ఆయనకున్న క్లారిటీని అందరికీ తెలియజేశారు. ఇక ప్రభాస్ చేసిన కామెంట్ చూసి ఏం క్లారిటీ గురూ అంటూ అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ మాట్లాడుతూ.. ఎస్.ఎస్ రాజమౌళి -జీనియస్, నాగ్ అశ్విన్ -స్ట్రాంగ్, ప్రశాంత్ నీల్ -బ్యూటిఫుల్ పర్సన్, మారుతి -క్యూట్, హను రాఘవపూడి -వెరీ హార్డ్ వర్కింగ్, సుజీత్ -స్మార్ట్, పూరి జగన్నాథ్ -జీనియస్, సందీప్ రెడ్డి వంగ -కల్ట్ డైరెక్టర్ అంటూ ఒక్కమాటలో డైరెక్టర్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

also read:Nidhhi Agerwal: ప్లకార్డులతో ఆశ్చర్యపరిచిన ఫ్యాన్స్.. కాబోయే వరుడిపై నిధి కామెంట్!

పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ..

పెళ్లి గురించి కూడా సుమ ప్రశ్నించింది. ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? అని అడగగా ప్రభాస్ మాట్లాడుతూ..” అది తెలియకనే ఇంకా నేను పెళ్లి చేసుకోలేదు” అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. మొత్తానికైతే ప్రభాస్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ప్రభాస్ కి ఉన్న క్లారిటీ చూసి సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×