E-Paper
Advertisement

Unmarried Couples: సహజీవనం.. పెళ్లికి ముందే గర్భం, అలాంటి వేస్తే ఆ గ్రామంలో శిక్షలు భారీగా

Unmarried Couples: సహజీవనం.. పెళ్లికి ముందే గర్భం, అలాంటి వేస్తే ఆ గ్రామంలో శిక్షలు భారీగా
Advertisement

Unmarried Couples: టెక్ యుగంలో కొన్ని ప్రాంతాల్లో రకరకాల కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. లేటెస్ట్ ట్రెండ్‌తో కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడున్న రోజుల్లో సహజీవనం, పెళ్లికి ముందే గర్బ దాల్చడం సాధారణంగా మారిపోయాయి.. పోతున్నాయి కూడా. వాటికి తాము దూరమని చెబుతోంది ఆ గ్రామం. తేడా చేస్తే శిక్షలతోపాటు భారీగా జరిమానాలు ఉండనున్నాయి.

చైనాలోని ఆ గ్రామం వాటికి దూరం

Advertisement

ప్రస్తుత రోజుల్లో చదువుకున్న యువతీయువకులు ఉపాధి కోసం నగరాలకు వలసపోతున్నారు. కొన్నివిషయాల్లో వారు కట్టుబాట్లు దాటుతున్న సందర్భాలు లేకపోలేదు. తొలుత సహజీవనం, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం కనిపిస్తున్నాయి. లేకుంటే చాలామంది సహజీవనంతో సరిపెడుతున్నారు. ఒకవేళ గర్బం దాల్చితే లేనిపోని సమస్యలు లేకపోలేదు. కానీ ఆ గ్రామం అందుకు విరుద్దం.

అలాంటి ఘటనలు ఏమైనా జరిగితే మాత్రం శిక్షలు దారుణంగా ఉంటాయని చెప్పుకనే చెబుతోంది. వివాహం సంబంధాల గురించి చైనాలోని ఓ చిన్న గ్రామం తీసుకున్న నిర్ణయాలపై ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. చైనాలోని యునాన్ ప్రావెన్సులోని ఓ గ్రామస్థులు ఈ కఠినమైన నిబంధనలు రూపొందించారు.

Advertisement

సహజీవనం, పెళ్లికి ముందే గర్భం వస్తే భారీగా జరిమానా

ఈ మేరకు ఆ గ్రామానికి చెందిన పెద్దలు ఓ తీర్మానం చేయడం, వాటిని అమలు చేయడం మొదలైపోయింది. ఆ గ్రామంలో ఎవరైనా వివాహం కాకుండా కలిసి ఉంటే ప్రతీ ఏటా సుమారు ఆరువేల రూపాయలు జరిమానాగా చెల్లించాలి. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన యువతి అయితే రూ.38,472, పెళ్లయిన తర్వాత 10 నెలల లోపు బిడ్డకు జన్మనిస్తే ఆ స్థాయిలో ఫైన్ కట్టాలన్నది ఆ గ్రామస్తుల రూల్స్.

దీనికితోడు ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే దాదాపు రూ.19 వేలు చెల్లించాలి. ఒకవేళ దంపతులు గొడవపడి గ్రామ పెద్దల వద్దకు వస్తే చెరో రూ.6 వేలు జరిమానా కట్టాలి. మద్యం సేవించి గొడవ చేస్తే రూ.38,472 నుంచి రూ.64,120 చెల్లించాలి. ఒకవేళ నిరాధార ఆరోపణలు, పుకార్లు క్రియేట్ చేస్తే రూ.6 వేల నుంచి 12 వేల వరకు జరిమానా తప్పదు.

ALSO READ:  తైవాన్‌ని కుదిపేసిన భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు

ఈ మేరకు ఆ గ్రామ పెద్దలు చేసిన తీర్మానాన్ని గ్రామంలోని కార్యాలయం ముందు బోర్డు పెట్టారు. సంప్రదాయ కుటుంబ విలువలు, నైతికతను కాపాడాలనే ఉద్దేశంతో వీటిని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. రకరకాల విమర్శలు మొదలయ్యాయి.

ఈ విషయాలు బయటకు పొక్కడంపై ఆ గ్రామస్తులు ఏర్పాటు చేసిన నోటీసు బోర్డుని తొలగించారు. ఈ వివరాలను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రస్తావించింది. దీనికి సంబంధించి డిసెంబర్ 16న మెంగ్డింగ్ టౌన్‌లోని ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. ఈ నోటీసు చాలా అసాధారణమైనదిగా వర్ణించారు. ప్రభుత్వానికి నివేదించకుండా గ్రామ కమిటీ సొంతంగా  ఏర్పాటు చేసిన నోటీసు తొలగించినట్టు చెప్పారు. అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ వివాహాలను నిషేధించే స్థానిక నిబంధనలు లేవన్నారు.

Related News

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఒకటే గోకుడు, వీడియో వైరల్

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

Big Stories

Advertisement
×