E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!
Advertisement

Renu Desai:రేణు దేశాయ్..హీరోయిన్ గా ,దర్శకురాలిగా,అన్నింటికీ మించి పవన్ కళ్యాన్ మాజీ భార్యగా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది.తాజాగా ఈవిడ ‘విజువల్ టాక్స్’అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొని మరోసారి తన పర్సనల్ లైఫ్ గురించి ,మహిళల స్వతంత్రత, కుటుంబ బాధ్యతల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

బాధ్యతల మధ్య బ్యాలెన్స్ పాటించడం ముఖ్యం 

Advertisement

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. మహిళలు తమకు నచ్చిన చదువు చదువుకోవాలని, నచ్చిన వృత్తిని ఎంచుకోవాలని, తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తామే తీసుకునే స్వేచ్ఛ ఉండాలని చెప్పారు. అయితే స్వతంత్రంగా ఉండటమంటే కుటుంబాన్ని పట్టించుకోకపోవడం కాదని, వ్యక్తిగత జీవితం, కుటుంబ బాధ్యతల మధ్య బ్యాలెన్స్ పాటించడం ముఖ్యమని తెలిపారు.

ఇక మహిళలు ఉద్యోగం చేయాలా? ఇంట్లో ఉండి కుటుంబాన్ని చూసుకోవాలా? అనేది పూర్తిగా వారి ఇష్టమని రేణు దేశాయ్ అన్నారు. ఇంట్లో ఉండి పిల్లలను, కుటుంబంలోని పెద్దవాళ్లను చూసుకోవడం కూడా పూర్తిస్థాయి బాధ్యతతో కూడుకున్న పనేనని చెప్పారు. హౌస్‌వైఫ్‌గా ఉండటాన్ని తక్కువగా చూడకూడదని, ఆ పని చేసే మహిళలకు కూడా తగిన గుర్తింపు దక్కాలని అభిప్రాయపడ్డారు.

Advertisement

మహిళలని గౌరవించాలి 

ఇక ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పనులు చేస్తూ కుటుంబాన్ని చూసుకునే మహిళలకు చాలాసార్లు కనీస గుర్తింపు కూడా దక్కడం లేదని ఆమె అన్నారు. ఆఫీసులో పనిచేసే వ్యక్తి తన పనికి ప్రశంసలు కోరుకున్నట్టే, ఇంట్లో కష్టపడే మహిళ కూడా తన పనిని గుర్తించాలని కోరుకుంటుందని వివరించారు. ఇంట్లో వండిన భోజనం బాగుందని ఒక్క మాట చెప్పినా, రోజంతా ఆమె పడిన కష్టానికి విలువ ఇచ్చినట్టేనని చెప్పారు.

ఇక మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ పురుషులైనా, మహిళలైనా తమ ప్రవర్తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు. స్వతంత్రత పేరుతో కుటుంబాన్ని, బాధ్యతలను పూర్తిగా పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదని వారికి కూడా అవసరమని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.ఇక అదే సమయంలో కుటుంబం పేరుతో మహిళలపై బలవంతంగా బాధ్యతలు రుద్దడం కూడా తప్పేనని స్పష్టం చేశారు.

భర్త పవన్ కళ్యాణ్ రాజకీయాలపై మాట్లాడుతూ 

ఇక తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ రాజకీయాలపై అభిప్రాయం అడిగినప్పుడు.. ఆయన డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే తాను ఏదైనా మాట్లాడినా, తనను ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే చూస్తున్నారని మనసులోని బాధని బయటపెట్టారు.

ఇక ఆద్య పుట్టి 16ఏళ్లు అయింది. ఇంకా నా వనవాసం కొనసాగుతూనే ఉంది. నేను ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాను. ఏదైనా మాట్లాడితే, నేను పవన్ కళ్యాణ్ మాజీ భార్యను అనే ముద్ర పడుతోంది. ఈ వనవాసం ఎప్పుడు ముగుస్తుందో నాకు తెలియదు” అంటూ ఎమోషనల్ అయ్యారు. మహిళలు తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలను దాటుకుని, తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కూడా ఆమె చెప్పుకొచ్చారు.

మొత్తానికి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చూడాలి వీటిపై ఎవరి నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో !

ALSO READ :సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Tags

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×