Antadupula Ramadevi Remuneration:’‘గణ గణ గంటల్లోనా అంజన్న ..ఘనమైన దేవుడవే అంజన్న”..ఈ పాట ఒకప్పుడు తెలంగాణా లోని గ్రామ గ్రామాన ప్రతీ గుళ్ళో మారుమ్రోగిపోయేది.ఇప్పటి తరానికి ఈ పాట క్రేజ్ తెలీకపోవచ్చు కాని ,90S జనరేషన్ కి ఈ పాట తోనే తెల్లారేది అంటే ఆశ్చర్యం లేదు.అంతలా ఊపేసింది ఈ హనుమాన్ పాట.
ఇక ఈ పాటకి వచ్చిన క్రేజ్ తో ఇదే ట్యూన్ తో మరెన్నో దేవుళ్ల పాటలు కూడా ఇబ్బడి ముబ్బడి గా వచ్చేశాయి.అయితే వచ్చిన ప్రతీ పాట కూడా అదే రేంజ్ లో మంచి స్పందన దక్కించుకోవడం విశేషం.ఇక ఆ పాట పాడిన అంతడుపుల రామాదేవి తెలీని వారు ఉండరంటే ఆశ్చర్యం లేదు.కేవలం దేవుడి పాటలే కాకుండా ఎన్నో జానపదాలని తన గొంతులో పలికించింది.మరి అంత క్రేజ్ కొట్టేసిన అంతడుపుల రమాదేవి ఒక్కో పాటకి అసలు ఎంత తీసుకుంటుందా అంటూ ఆరాలు తీస్తున్నారు ఫోక్ లవర్స్.
పాటల విషయానికి వస్తే
అంతడుపుల రమాదేవి పాటల విషయానికి వస్తే తనదైన అధ్బుతమైన గొంతుతో ఎన్నో జానపదాలని అవలీలగా పాడేసింది.ఇక అవన్నీ ఒకప్పుడు తెలంగాణా ప్రజలని ఒక ఊపు ఊపేశాయి కూడా. వాటిలో ముఖ్యంగా ‘నాగలి దున్నేటి బంగారు మరిది ‘ఆడజన్మే పాడుజన్మ’,‘కొడుకా ఎక్కడున్నావు’,‘వడ్డంటే వినవేమి ఓ మొగుడా’,‘మామా కొడుకా మల్లేశా’, ‘ముద్దుల నా మొద్దు మొగుడా’ వంటి పాటలకి స్టెప్పులు వెయ్యని తెలంగాణా వ్యక్తి లేడంటే ఆశ్చర్యం లేదు.
‘నాగలి దున్నేటి బంగారు మరిది’
ముఖ్యంగా ‘నాగలి దున్నేటి బంగారు మరిది’అనే జానపదం 90S జనరేషన్ కి ఒక మంచి నోస్టాల్జియా ఫీలింగ్. ఇప్పుడంటే సోషల్ మీడియా జమానా వచ్చేసి నెట్టింట జానపదాలు విచ్చలవిడిగా వైరల్ అయిపోయి మిలియన్ల వ్యూస్ కొల్లగోడుతున్నాయి.కానీ ఇరవై ఏళ్ల కిందటే ఈ పాట కొన్ని కోట్ల ,మంది గుండెల్లో ఒక మంచి అనుభూతిగా మిగిలిపోయింది.ఇక అప్పట్లో ఎన్నో స్కూల్ ఫంక్షన్స్ లో ఈ పాటకి స్టెప్పులేసిన పిల్లలు ఎందఱో.ఇక ఆ పాటలే కాకుండా అమ్మవారి భక్తి గీతాలు, అంజన్న చరిత్ర, వెంకటేశ్వర స్వామి చరిత్ర వంటి ఎన్నో భక్తి ఆల్బమ్లు ఆమె పాడటం విశేషం.
పారితోషికం విషయానికి వస్తే
ఇదిలా ఉంటే,అంతడుపుల రామాదేవి ఒక్క పాట పాడటానికి ఎంత పారితోషికం తీసుకుంటుంది అనే విషయానికి వస్తే.. నిర్మాత బడ్జెట్ ని బట్టి ఒక్కో పాటకి 15 వేల నుండి 35 వేల వరకు తీసుకుంటుందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త.ఇక పాడే పాట స్థాయి పెద్దది అయితే ఈ పారితోషికం మరింత పెరుగుతుందని,కొన్ని సార్లు తగ్గించుకొని పాడిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.అయితే తాజాగా కొత్త తరం గాయనీ మణులు దూసుకురావడంతో వీరు కాస్త పాటలు ఎక్కువ పాడకపోవడం కూడా మనకి కనిపిస్తుంది. మరి ఈ పారితోషికం విషయంలో,పాటల విషయంలో నిజానిజాలు ఏంటి అన్నది అంతడుపుల రామాదేవి గారే బయటపెట్టాలి.
ఇంకెన్ని అద్భుతమైన పాటలు దూసుకువస్తాయో !
ఏది ఏమైనా తెలంగాణా మట్టి పరిమళాలని వెదజల్లుతూ తనదైన గొంతుతో ఎన్నో వేలకు పైగా అద్భుతమైన పాటలు పాడిన అంతడుపుల రామాదేవి 90S జనరేషన్ కి ఒక మంచి జ్ఞాపకం అని చెప్పకతప్పదు.చూడాలి ముందు ముందు తన గొంతులో ఇంకెన్ని అద్భుతమైన పాటలు దూసుకువస్తాయో !
ALSO READ :జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?