E-Paper
Advertisement

Renu Desai: మహేష్ బాబు సినిమాలో రేణు దేశాయ్.. కుట్ర చేశారన్న నటి?

Renu Desai: మహేష్ బాబు సినిమాలో రేణు దేశాయ్.. కుట్ర చేశారన్న నటి?
Advertisement

Renu Desai: రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు. బద్రి సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈమె పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమాలో కూడా నటించే సందడి చేశారు. ఇలా ఈ సినిమాల సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన రేణు దేశాయ్(Renu Desai) అతనిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే కొన్ని కారణాలవల్ల ఈమె పవన్ కళ్యాణ్ కు దూరంగా తన పిల్లలతో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా పిల్లల బాధ్యతలను చూసుకుంటూ రేణు దేశాయ్ తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

టైగర్ నాగేశ్వరరావు..

సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు, తన పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కూడా అవకాశం వచ్చిందని రేణు దేశాయ్ సందర్భంగా తెలియజేశారు.

వ్యక్తిగత కారణాలవల్ల తప్పుకున్నాను..

Advertisement

మహేష్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు సర్కారు వారి పాట సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం చిత్ర బృందం నన్ను సంప్రదించారని రేణు దేశాయ్ తెలియజేశారు. అయితే ఆ పాత్ర తనకు చాలా బాగా నచ్చిందని అందులో నటించడానికి కూడా ఆసక్తి కనబరిచానని ఈమె తెలియజేశారు కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం చేజారి పోయిందని తెలియజేశారు. అయితే ఆ వ్యక్తిగత కారణాలు ఏంటి అనే విషయాలను మాత్రం ఈమె చెప్పడానికి ఇష్టపడలేదు.

అనవసరమైన వివాదం..

Advertisement

ప్రస్తుతం ఆ కారణాలను నేను బయట పెట్టడం వల్ల అనవసరమైన వివాదాలకు ఆజ్యం పోసినట్టు అవుతుందని, అందుకే ఆ వివరాలను బయటపెట్టను అంటూ రేణు దేశాయ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాత్ర నుంచి రేణు దేశాయ్ తప్పుకోవడం వెనుక ఏదైనా కుట్ర జరిగిందా? అందుకే ఈమె తప్పుకోవాల్సి వచ్చిందా? నిజంగానే కుట్ర జరిగి ఉంటే చేసింది ఎవరు? అంటూ విభిన్న రీతిలో అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా మహేష్ బాబు సినిమాలో చేసే అవకాశం వచ్చిన చేజారి పోయిందనే విషయం తెలియగానే అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత ఈమె ఇటీవల బ్యాడ్ గర్ల్స్ అనే ఒక సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు.

Also Read: Raviteja: భర్త మహాశయులకు విజ్ఞప్తి క్రెడిట్ మొత్తం వారిద్దరిదే.. నాదికాదు: రవితేజ

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×