E-Paper
Advertisement

CM Revanth: చదువే నా ఫస్ట్ ప్రయారిటీ, జడ్చర్లలో ఐఐటీ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

CM Revanth: చదువే నా ఫస్ట్ ప్రయారిటీ, జడ్చర్లలో ఐఐటీ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన
Advertisement

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధియే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం జడ్చర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (IIT) భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేశారు.

ఇరిగేషన్, ఎడ్యుకేషన్ నా తొలి ప్రయారిటీ.. 

Advertisement

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన ప్రభుత్వంలో సాగునీరు, విద్య రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘ఉమ్మడి పాలమూరు జిల్లా వెనుకబాటుతనాన్ని పారద్రోలాలంటే నాణ్యమైన విద్య, సమృద్ధిగా సాగునీరు అందాలి. అందుకే ఈ రెండు రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర ఇప్పుడు పంచడానికి భూములు లేవని, కానీ పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందించే సంకల్పం ఉందని స్పష్టం చేశారు.

75 ఏళ్ల తర్వాత దక్కిన గౌరవం.. 

Advertisement

హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు గారు పాలమూరు బిడ్డ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మళ్లీ 75 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ అవకాశం ఈ ప్రాంతానికి దక్కిందని, తనను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించిన ఈ గడ్డ రుణం తీర్చుకుంటానని భావోద్వేగంగా మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానం జిల్లా పరిషత్ సభ్యుడిగా (ZPTC) మొదలైందని, పట్టుదల, కృషితోనే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని విద్యార్థులకు వివరించారు.

విద్యార్థులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం.. 

విద్యార్థులతో ముచ్చటిస్తూ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భాష అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ సాధనం మాత్రమే. ఇంగ్లీష్ రాదని భయపడాల్సిన పనిలేదు. భాషతో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవాలి. అప్పుడే ప్రపంచంతో పోటీ పడగలరు’ అని సూచించారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

తల్లిదండ్రులను, ఊరును మరవొద్దు.. 

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి హితబోధ చేశారు. ‘మీరు జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా, కన్న తల్లిదండ్రులను మరియు పుట్టిన ఊరును మర్చిపోవద్దు. ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకపోతే ఆ జీవితం నిష్ప్రయోజనం’ అని విద్యార్థులకు హితవు పలికారు. సామాజిక బాధ్యతతో మెలిగి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ALSO READ: Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర వచ్చేస్తోంది.. త్వరలో భారీ పోలీస్ రిక్రూట్మెంట్, ప్రిపరేషన్ షురూ చేయండి..

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×