E-Paper
Advertisement

Renu Desai: అనారోగ్యంతో రేణు దేశాయ్.. ప్రముఖ హాస్పిటల్లో సర్జరీ?

Renu Desai: అనారోగ్యంతో రేణు దేశాయ్.. ప్రముఖ హాస్పిటల్లో సర్జరీ?
Advertisement

Renu Desai: ప్రముఖ సినీ నటి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) అనారోగ్యానికి గురి అయ్యారు. అయితే ఈమెకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని గతంలో ఎన్నో సందర్భాలలో తన ఆరోగ్య సమస్యలను తెలియజేశారు. అయితే తాజాగా రేణు దేశాయ్ కి మేజర్ సర్జరీ (Surgery)కూడా జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని రేణు దేశాయ్ చాలా ఆలస్యంగా బయటపెట్టారు. తాజాగా ఈమె తన కుమార్తె ఆద్య(Adhya)తో కలిసి దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేశారు. అయితే ఈ ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్..” సర్జరీ తర్వాత నా క్యూటీతో డిన్నర్ కు వెళ్లాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రేణు దేశాయ్ కు సర్జరీ..

Advertisement

ఈ విధంగా రేణు దేశాయ్ ఒక్కసారిగా సర్జరీ తర్వాత డిన్నర్ వెళ్లాను అని చెప్పటంతో ఆమె అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు రేణు దేశాయ్ కి సర్జరీ జరగడం ఏంటి? ఆమెకు ఏం జరిగింది? ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె షేర్ చేసిన ఫోటోలో తనకు ఎలాంటి సర్జరీ జరిగింది. అసలు ఏం జరిగిందనే విషయాలను ఎక్కడ ప్రస్తావించలేదు కానీ సర్జరీ మాత్రం జరిగిందని చెప్పుకు వచ్చారు. ఇక ఈమె ఫేస్ కూడా పూర్తిగా కల తప్పిపోయిందని అభిమానులు భావిస్తున్నారు.

గుండె సంబంధిత సమస్యలు..

Advertisement

ఇకపోతే గతంలో తనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని రేణు దేశాయ్ వెల్లడించారు. గుండె సంబంధిత సమస్యల కారణంగానే సర్జరీ జరిగిందా? అనే సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమెకు సర్జరీ జరిగిందనే విషయం అభిమానులను ఎంతో కంగారుకు గురిచేస్తుంది. అయితే ఈ సర్జరీ గురించి పూర్తి వివరాలను రేణు దేశాయ్ తెలియచేస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.

రెండో పెళ్లి పై క్లారిటీ..

ఇక పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన రేణు దేశాయ్ ఆయనని వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత పవన్ కళ్యాణ్ తో వచ్చిన విభేదాలు కారణంగా రేణు దేశాయ్ విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఈమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇక రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత రెండో పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈమె కూడా తాను రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని అయితే తన పిల్లలకు నా అవసరం లేదనిపించినప్పుడు నేను రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ పలు సందర్భాలలో తెలియజేస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం అఖీరానందన్ నటనలో శిక్షణ తీసుకుంటూ బిజీగా ఉండగా, ఆద్య కూడా ఉన్నత చదువులు చదువుతున్నారని తెలుస్తోంది. ఇక రేణు దేశాయ్ చాలా గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రేణు దేశాయ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కానీ ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.

Also Read: రామాయణ నుంచి తప్పుకున్న కాజల్.. ఛాన్స్ కొట్టేసిన క్రేజీ బ్యూటీ!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×