Radhika Murder Case : భారత టెన్నిస్ లో ఓ విషాదం నెలకొంది. ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కి గురైన విషయం తెలిసిందే. రాధిక ను ఆమె తండ్రే కాల్చి చంపాడు. వాస్తవానికి తన తండ్రి రివాల్డర్ తో మూడు బుల్లెట్లను ఉపయోగించి కూతురుని చంపాడు. ఈ నేపథ్యంలో గురు గ్రామ్ లో టెన్నీస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్టిస్ట్ కిమ్ తో కలిసి ఆమె నటించిన కర్వాన్ అనే మ్యూజిక్ వీడియోలో కొన్ని రొమాంటిక్ సీన్లు ఉండటంతో కూతురుని తండ్రి మందలించినట్టు సమాచారం. వీడియోలు చేయవద్దని చెప్పినా వినకపోవడంతో తండ్రి ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
Also Read : Gill – Sara : సారాతో డేటింగ్..గిల్ ను జడేజా ఎలా ఆడుకున్నాడో చూడండి.. వీడియో వైరల్
అందుకే చంపేశా..
తమ కూతురు సంపాదనతోనే జీవిస్తున్నానని కొందరూ తనను హేళన చేశారి, ఆ అవమానాన్ని తట్టుకోలేకనే చంపేశానని తండ్రి దీపక్ తెలిపారు. టెన్నీస్ అకాడమీని మూసి వేయాలని ఎన్నిసార్లు చెప్పినా వినలేదన్నారు. నేషనల్ లెవల్ ప్లేయర్ అయిన రాధిక గాయం కారణంగా ఆటకు దూరమయ్యారు. అకాడమీ స్తాపించి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేవారు. అయితే రాధిక యాదవ్ ని హత్య చేసిన ఆమె తండ్రి దీపక్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అతను హత్య చేసేందుకు ఉపయోగించినటువంటి రివాల్వర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాధిక మార్చి 23, 2000 లో పుట్టింది. టెన్నీస్ లో రాధిక అంతర్జాతీయ స్థాయిలో భారత్ కి ప్రాతినిధ్యం వహించింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ టెన్నీస్ ప్లేయర్ లో రాధిక ర్యాంక్ 113. ITF డబుల్స్ లో టాప్ 2000 లో రాధికకు ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్ కనబరిచింది. రాధిక తండ్రే ఆమె జీవితాన్ని ముగించాడు. రాధికా యాదవ్ టెన్నీస్ ప్రయాణం ప్రారంభం కాకముందే ఆమె జీవిత ప్రయాణం ముగిసిపోయింది. ఇక ఈ వార్త బయటపడగానే గురుగ్రామ్ లోని సెక్టార్ 57లో నిశ్చబ్దం అలుముకుంది. చుట్టు పక్కల ప్రజలందరూ ఈ సంఘటనతో దిగ్బ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా రాధిక హత్య అందరినీ షాక్ కి గురి చేసింది.
కాపాడాల్సిన తండ్రే..
కంటికి రెప్పలా కాపాడుకునే కన్న తండ్రినే కూతురు ని కాల్చి చంపడం దారుణం అని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి వారికి ఉరిశిక్ష వేయాలంటున్నారు. కూతురు మ్యూజిక్ సాంగ్స్ చేయడం ఇష్టం లేదని.. తండ్రి ఇలా చేయడమా..? అంటూ దేశవ్యాప్తంగా అందరూ ఆ తండ్రికి తగిన బుద్ది చెబితే ఇలాంటి ఘటనలు రిపీట్ కావంటున్నారు. వాస్తవానికి ఒక కూతురు తప్పు చేస్తే.. సర్ది చెప్పాల్సింది తండ్రి. కానీ ఇక్కడ ఆ తండ్రి నే కూతురుని కాల్చి చంపాడు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ కారణంగా సోషల్ మీడియా రీల్స్ చేయడం వంటి కారణాలకే ఇంత పెద్ద నేరానికి ఒడిగట్టడం సమాజానికి ఓ హెచ్చరిక అనే చెప్పాలి.
Radhika Yadav was killed by her father, Deepak Yadav, for being in a relationship with Inam Ul Haq. This is the song she did with him. She also wanted to quit tennis and pursue acting, Whatever the case, he should’ve just disowned her instead of taking her life. pic.twitter.com/1KCgSfvmBW
— KARNA (@S_Karna002) July 11, 2025