E-Paper
Advertisement

Jai Hanuman: రిషబ్ శెట్టి స్ట్రిక్ట్ రూల్స్, ప్రశాంత్ ఆ లోపు పూర్తి చేయాల్సిందే

Jai Hanuman: రిషబ్ శెట్టి స్ట్రిక్ట్ రూల్స్, ప్రశాంత్ ఆ లోపు పూర్తి చేయాల్సిందే
Advertisement

Jai Hanuman: ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చాలామందికి అర్థం కాకుండా పోయింది. నిజమైన అతనికి విపరీతమైన పేరు తీసుకొచ్చిన సినిమా మాత్రం హనుమాన్. ఆ సినిమా కథతో పాటు ముఖ్యంగా ఆ విజువల్స్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. అని ఆ సినిమా మ్యూజిక్ మాత్రం ఇప్పటికే విపరీతంగా ఆకట్టుకుంటుంది. చాలామందికి ఆ బాధ కూడా ఉంది అంత మంచి మ్యూజిక్ వేస్ట్ అయిపోయింది అని ఇప్పటికీ కొంతమంది బాధపడుతూ ఉంటారు.

Advertisement

ఆ తర్వాత సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. తక్కువ థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా కేవలం మౌత్ టాకుతోను మంచి పేరు సంపాదించి థియేటర్స్ కూడా పెరిగేలా చేసింది. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో ఈ రేంజ్ విఎఫ్ఎక్స్ చేయడం అనేది ప్రశాంత్ వర్మకు విపరీతమైన పేరు తీసుకొచ్చింది.

రిషబ్ శెట్టి స్ట్రిక్ట్ రూల్స్

హనుమాన్ సినిమా హిట్ అయినప్పుడే చివర్లో జై హనుమాన్ అనే సినిమా రాబోతున్నట్లు అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ సినిమాలో ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరో కనిపిస్తారు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి ఏకంగా 6 నెలలు టైం కేటాయించారట. కేవలం ఈ 6 నెలల్లోనే ప్రశాంత్ వర్మ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందు షూటింగ్ జరిగిపోతే ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి టైం తీసుకున్న పర్వాలేదు. ఎందుకంటే స్వతహాగా రిషబ్ శెట్టి కూడా దర్శకుడు కాబట్టి తన పనులు కూడా తనకు ఉంటాయి.

పూర్తి చేయాల్సిందే 

జై హనుమాన్ సినిమాని త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులు ముందుకు ప్రశాంత్ వర్మ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హనుమాన్ పాత్రతో కూడుకున్న చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. నితీష్ దర్శకత్వంలో రణబీర్ కపూర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

రణబీర్ రాముడు పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఆ సినిమాలో ఆంజనేయుడు పాత్ర కూడా ఉండబోతుంది. మహేష్ బాబు వారణాసి సినిమాలో కూడా ఆంజనేయుడు కనిపించబోతున్నాడు.

వీటన్నిటికంటే ముందు ప్రశాంత్ వర్మ సినిమా చేసేస్తే కొంతమేరకు సేఫ్ అని చెప్పొచ్చు. లేదంటే ఆ సినిమాలు ఇంకో స్టాండర్డ్స్ పెడితే దానిని అందుకోవాల్సి వస్తుంది. ఇంకా ప్రశాంత్ వర్మ ఏం చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Premante : ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్ విడుదల, సినిమా చూడాలా వద్దా అన్న?

Related News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

Big Stories

Advertisement
×