Vaishnavi Chaitanya:సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కెరియర్ మొదలుపెట్టి బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (shanmukh Jaswant)తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). అలా సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో హీరోకి చెల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమెకు బేబీ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. ఈ సినిమాతో తన అద్భుతమైన నటనను కనబరిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఇందులో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) , విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించగా.. వైష్ణవి చైతన్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ లో అద్భుతంగా ఒదిగిపోయింది.. ముఖ్యంగా ఈ సినిమాలోని తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మళ్లీ ఆనంద్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్లో కాదు ఏకంగా కోలీవుడ్లో అది కూడా ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.
అసలు విషయంలోకి వెళ్తే… కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ఆర్య తన 40వ సినిమాలో వైష్ణవి చైతన్యకి అవకాశం కల్పించారు.నిఖిల్ మురళి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ది షో పీపుల్ మీడియా బ్యానర్ పై ఆర్య, సాయేషా నిర్మించిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య , నిఖిల విమల్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఆర్య హీరోగా నటిస్తున్నారు.గత ఏడాది డిసెంబర్లో అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది..
ALSO READ:Kalyani Priyadarshan: కథల కంటే వారికే ప్రాధాన్యత.. నిర్మాతలకు కళ్యాణి కౌంటర్!
ఇదిలా ఉండగా మరొకవైపు వైష్ణవి చైతన్య హీరో ఆర్యతో జిమ్లో కలిసి వర్కౌట్స్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆర్యతో పాటు వైష్ణవి , నిఖిల విమల్ జిమ్ లో తెగ కష్టపడి పోతూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.. ఏది ఏమైనా వైష్ణవి చైతన్య ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యతో రొమాన్స్ కి సిద్ధమయ్యిందా అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.. ఇకపోతే తాజాగా వైష్ణవి చైతన్య హీరో ఆర్యతో జిమ్లో కలిసి దిగిన ఫోటోలను నెట్టింట ఆమె స్వయంగా షేర్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తానికైతే జోరు పెంచేసిన ఈ ముద్దుగుమ్మ ఇక అక్కడే కోలీవుడ్లో వరుస అవకాశాలు అందుకొని సెటిలై పోతుందేమో అనే కామెంట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు.
#Arya40 Working out in progress 🔥@arya_offl @iamvaishnavi04 @Nikhilavimal1 @gvprakash #Arya #Vaishnavichaitanya #Nikhilavimal pic.twitter.com/Fq7I875I3l
— BIG TV Cinema (@BigtvCinema) March 10, 2026