E-Paper
Advertisement

అత్యున్నత పురస్కారం అందుకున్న రోజా కూతురు అన్షు మాలిక..

అత్యున్నత పురస్కారం అందుకున్న రోజా కూతురు అన్షు మాలిక..
Advertisement

Roja Daughter: ప్రముఖ సినీ నట రాజకీయ నాయకురాలుగా కొనసాగుతున్న ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రోజా రాజకీయ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఇక రోజా కుమార్తె అన్షు మాలిక ప్రస్తుతం విదేశాలలో ఉన్నత చదువులు చదువుతున్నారు. అన్షు మాలిక చదువుల పట్ల ఇప్పటికే ఎన్నో అవార్డులను పురస్కారాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమెకు మరొక అత్యున్నత పురస్కారం లభించింది. ప్రస్తుతం అన్షు మాలిక అమెరికాలో చదువుకుంటున్నారు. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ(Indiana University) నుంచి తాజాగా ఈమె ఒక పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.

కల నిజమైన వేళ..

అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ అందించే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన హెర్మాన్ బి వెల్స్ 2026 (Herman B Wells 2026 Award)అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ విషయానికి సంబంధించి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినీనటి రోజా సైతం ఈ అవార్డు వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్తాగ్రం వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కూతురితో దిగిన ఫోటోలను రోజా షేర్ చేస్తూ కల నిజమైంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నీ ధైర్యమే నిన్ను నడిపించింది..

Advertisement

నా చిట్టి తల్లి హెర్మన్ బి వెల్స్ 2026 అవార్డు అందుకోవడం ద్వారా బ్లూమింగ్ టన్ లో చరిత్ర సృష్టించింది. ఒక చిన్న కలగా మొదలయ్యి ఇప్పుడు ఆకలను నిజం చేసుకోవడం ఎంతో గర్వకారణం అలాగే ఎందరికో స్ఫూర్తి. నీ కష్టం, అంకితభావం, ధైర్యమే నిన్ను ఇక్కడి వరకు నడిపించాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ అన్షు మాలిక సాధించిన ఈ విజయం పట్ల రోజా తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తన కూతురిపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇక రోజా కుమార్తె ఈ విధమైనటువంటి పురస్కారాన్ని అందుకున్న నేపథ్యంలో రోజా అభిమానులు కూడా ఈమె సాధించినటువంటి ఘనత పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఈ అవార్డు ప్రత్యేకత ఏంటి అనే విషయానికి వస్తే..ఈ అవార్డు ఇండియానా యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడి పేరు మీదగా అందజేస్తున్నారు. ఉన్నతమైన విద్య, ప్రతిభ, నాయకత్వం, విశ్వవిద్యాలయానికి చేసిన సేవను గుర్తిస్తూ విద్యార్థులకు అందజేస్తారు. ప్రతి ఏడాది ఈ యూనివర్సిటీ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తూ ఉంది. ఇక ఈ అవార్డు అందుకున్నటువంటి విద్యార్థుల పేర్లను ఇండియానా మెమోరియల్ యూనియన్‌లో శాశ్వతంగా వారి పేర్లను ప్రదర్శించబడతాయి. ఇక రోజా కూతురు అన్షు ఇదివరకే ఈ విధమైనటువంటి ఎన్నో పురస్కారాలను అందుకోవడమే కాకుండా ఎన్నో సరికొత్త రికార్డులను కూడా సృష్టించారు. ఇంత చిన్న వయసులోనే అన్షు మాలిక ఈ విధమైనటువంటి విజయాలను అందుకుంటున్న నేపథ్యంలో రోజా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ కు సర్జరీ.. త్వరగా కోలుకోవాలంటూ అల్లు అర్జున్ పోస్ట్!

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×