E-Paper
Advertisement

రూట్ మార్చిన ప్రశాంత్ నీళ్.. హారర్ తో వణికించడానికి వస్తున్న ‘418’!

రూట్ మార్చిన ప్రశాంత్ నీళ్.. హారర్ తో వణికించడానికి వస్తున్న ‘418’!
Advertisement

Prashanth neel:కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో సంచలనం సృష్టించి నేడు పాన్ ఇండియా డైరెక్టర్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీళ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన నిత్యం మాస్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విపరీతంగా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా జానర్ మార్చి ఇకపై హారర్ అంటే నవ్వుకోవడం కాదు వెన్నులో వణుకు పుట్టాల్సిందే అంటూ 418 అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

రూట్ మార్చిన ప్రశాంత్ నీళ్.. హారర్ మూవీతో..

ఈ మధ్యకాలంలో హారర్ కామెడీ చిత్రాల హవా ఎక్కువగా నడుస్తున్న విషయం తెలిసిందే.. అయితే వాటన్నింటికీ భిన్నంగా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా.. ప్యూర్ హారర్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దర్శకుడు కీర్తన నాదగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ..” హారర్ సినిమాలలో నవ్వింది చాలు. ఇక భయపడాల్సిన సమయం వచ్చింది” అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా పోస్టర్ ను బయటకు రిలీజ్ చేశారు. ఇక ట్యాగ్ లైన్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో అసలు కామెడీకి చోటు ఉండదని.. కేవలం భయం, మిస్టరీ మాత్రమే ప్రధాన అంశంగా ఉంటాయని చిత్ర బృందం స్పష్టం చేస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ రావడం ఖాయం అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

దెయ్యాల కథా ? లేక సైకాలజికల్ థ్రిల్లర్ మూవీనా?

Advertisement

తాజాగా విడుదల చేసిన పోస్టర్లో రక్తం మరకలతో ఉన్న ఒక తలుపు.. దానిపైన 418 అనే నంబర్ ఉంచడం చూస్తుంటే ఇందులో ఏదో ఒక పెద్ద మిస్టరీ ఉందని మాత్రం స్పష్టం అవుతుంది. అయితే ఇది కేవలం దెయ్యాల కథ లేక సైకాలజికల్ థ్రిల్లర్ మూవీనా అనేది ఇంకా చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి ఎందుకంటే ఆయన చిత్రాలు దాదాపుగా బ్లాక్ డార్క్ థీమ్ తోనే వస్తాయి .ఇక అలాంటి డార్క్ థీమ్, ఇంటెన్స్ యాక్షన్ ఇప్పుడు ఈ హారర్ మూవీకి కూడా తోడైతే బ్లాక్ బస్టర్ ఖాయం, రికార్డులు తిరగ రాయడం పక్క అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీళ్ లాంటి విజినరీ దర్శకుడు కలిసి ఈ సినిమాను సమర్పిస్తుండడంతో ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను సృష్టిస్తోంది.

also read:తండ్రికేమో రూ.2500 కోట్ల ఆస్తి.. నెలకు రూ.4500 జీతంతో పల్లెటూరి జీవితం గడుపుతున్న స్టార్ కిడ్.. ఎవరంటే?

మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ..

Advertisement

ఇక ఇన్ని రోజులు మాస్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత్ నీళ్ ఇప్పుడు తొలిసారి జానర్ మార్చి హారర్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతుండడంతో.. ఆడియన్స్ లో సరికొత్త ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో చరణ్ లక్కరాజు, సూర్య రాజ్, ప్రీతి పగడల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని.. ఈ చిత్రం అప్పుడే ప్రమోషన్ మొదలు పెట్టేసింది.. మొత్తానికైతే ప్రశాంత్ నీళ్ ఈ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ అందుకోవడానికి సిద్ధమైపోయారని చెప్పాలి.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×