E-Paper
Advertisement

Mowgli Teaser: మగాడిగా పుట్టడమే దరిద్రం రా.. ఆసక్తికరంగా మోగ్లీ టీజర్ !

Mowgli Teaser: మగాడిగా పుట్టడమే దరిద్రం రా.. ఆసక్తికరంగా మోగ్లీ టీజర్ !
Advertisement

Mowgli Teaser: సుమ కనకాల(Suma Kanakala) కుమారుడు రోషన్(Roshan) హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బబుల్ గమ్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ కనకాల త్వరలోనే మోగ్లీ (Mowgli)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగ ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఇక ఈ టీజర్ చూస్తుంటే సీతారాముల ప్రేమ కథగా కొనసాగుతున్న ఈ కథలో రావణాసురుడు ఎంట్రీ ఇస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారనే నేపథ్యంలో సినిమా రాబోతుందని స్పష్టం అవుతుంది.

నేను రాముడిని..తను నా సీత ..

ఈ టీజర్ వీడియో కనుక చూస్తే అడవిలోనే ఈ సినిమా కథ మొత్తం కొనసాగుతుందని తెలుస్తోంది. “తను నా సీత నేను రాముడిని”, రావణాసురుడు లేడులే.. అనే డైలాగులు చూస్తేనే ఈ సినిమా కథ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక టీజర్ చివరిలో “మగాడిగా పుట్టడమే పెద్ద దరిద్రం.. కనీసం ఏడవడానికి బాధలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదంటూ” హీరో చెప్పే డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఈ టీజర్ వీడియోని ప్రముఖ నటుడు ఎన్టీఆర్ (NTR)చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టీజర్ లాంచ్ చేసిన ఎన్టీఆర్..

Advertisement

ఈ సినిమాని పీపుల్స్ మీరియో ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ (Sandeep Raj)దర్శకత్వం వహించగా బండి సరోజ్ (Bandi Saroj)విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో సాక్షి హీరోయిన్ గా నటించగా, వైవా హర్ష వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్, గ్లింప్ వీడియో సినిమా పై మంచి అంచనాలను పెంచేసింది. తాజాగా టీజర్ కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాలి. డిసెంబర్ 12 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక రోషన్ కనకాల సుమ రాజీవ్ కనకాల వారసుడు అనే విషయం మనకు తెలిసిందే. ఇదివరకే ఈయన బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన నటన పరంగా రోషన్ కు మంచి మార్పులే పడ్డాయి. ఇలా మొదటి సినిమా ద్వారా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకొని రోషన్ మోగ్లీ సినిమాతో హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సినిమా తనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాలి అంటే డిసెంబర్ 12వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read: Actor Govinda:మృతి అంటూ ఫేక్ న్యూస్.. గోవిందా ఫస్ట్ రియాక్షన్.. ఏం అన్నాడంటే?

Related News

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

Big Stories

Advertisement
×