E-Paper
Advertisement

Top 20 News Today: ఐఏఎస్ అధికారి బహిరంగ క్షమాపణ, తను నా భార్యే.. క్రికెటర్

Top 20 News Today: ఐఏఎస్ అధికారి బహిరంగ క్షమాపణ, తను నా భార్యే.. క్రికెటర్

1. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు అందించడమే లక్ష్యం: సీఎం

రాష్ట్రంలో 2029 నాటికి ఇల్లు లేని నిరుపేద అనేవారే ఉండకూడదన్నారు సీఎం చద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ సొంతిల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదని, అదొక గౌరవం, భద్రత, భవిష్యత్తుకు చిరునామా అని ఆయన అభివర్ణించారు.

2. వృద్ధురాలి ఇంట్లో పుస్తెలుతాడు అపహారన

ఓ వృద్ధురాలి ఇంట్లోకి 4 తులాల పుస్తెలుతాడును దొంగలించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కరంపేటకు చెందిన మాణెమ్మ అనే వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆమె కళ్లలో కారం కొట్టి పుస్తెలుతాడు దొంగలించాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.

3. బైకులు దగ్ధం

బాపట్ల జిల్లా, జబ్బార్ కాలనీలో ఓ ఇంటి ముందు నిలిపిన నాలుగు బైకులకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. అస్సాంకు చెందిన అలీమ్ ఉద్దీన్ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు వేటపాలెం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

4. మద్యం మత్తులో ఇంటిపై దాడి

మద్యం మత్తులో ఓ ఇంటిపై దాడి జరిగిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రాచకొండ పరిధిలో అర్ధరాత్రి మద్యం మత్తులో ప్రణీత్ గౌడ్ అతని స్నేహితులు ఇంటి తలుపులు, అద్దాలు పగులగొట్టి, లోపల ఉన్న యువకులైన శైలస్, పాల్‌పై దాడి చేసి ఫోన్ పగలగొట్టారు. మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

5. సేప్టీ నిబంధనలు తప్పనిసరి- డీసీసీ

నార్త్ జోన్ పరిధిలోని హోటల్, లాడ్జ్ యజమానులతో డీసీపీ రష్మి పేరుమాల్ సమావేశమయ్యారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, BNSS నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, విజిటర్ రిజిస్టర్, సీసీటీవీలు ఉంచాలని డీసీపీ ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలు, అనుమతి లేని ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

6. సత్తెనపల్లిలో వైసీపీ ఇంఛార్జి భారీ ర్యాలీ

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో వైసీపీ ఇంఛార్జి గజ్జల సుదీర్ భార్గవరెడ్డి ర్యాలీ నిర్వహించారు. పేదలకు వైద్య విద్యను దూరం చేయాలనే దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం P4 విధానంలో ప్రైవేటీకరించాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ఈ నెల 23న కోటి సంతకాలు గవర్నర్‌కు సమర్పిస్తామని తెలిపారు.

7. కూటమి ప్రభుత్వం కృషి

పేదవారి సొంతింటి కల సహకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 16 నెలల్లో 3 లక్షల గృహాలను పూర్తి చేసి, పేదలకు సొంతింటి కల సాకారం చేసిందన్నారు.

8. భార్యభర్తలకు కౌన్సెలింగ్

చిన్న చిన్న గొడవలతో విడిపోయిన భార్యాభర్తలను కలిపేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల. గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు 110 జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ కలిపామని తెలిపారు. పంతాలకు పోకుండా, సర్దుకుపోవాలని ఎస్పీ దంపతులకు హితవు పలికారు.

9. ఐఏఎస్ అధికారి బహిరంగ క్షమాపణ

మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ చెప్పారు. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణ కిషోర్‌లకు అన్యాయం జరుగుతుంటే.. తాను ఆపలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజలు తనను దుర్మార్గుడిగా చూస్తున్నారని తెలిపారు. చాలా ఆలోచించిన తర్వాత తన తప్పును తెలుసుకున్నానన్నారు.

10. ప్రోటోకాల్.. బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య ఘర్షణ

ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పదవులు లేని వారిని వేదికపై కూర్చోబెట్టడంపై కాంగ్రెస్ అభ్యంతరం చెప్పి.. ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను పంపించివేశారు.

11. కూటమి ప్రభుత్వం పై ఎమ్మెల్యే విమర్శలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ.. నెల్లూరు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీల భూములను.. 100 రూపాయలకు విక్రయిస్తున్నారంటూ విమర్శించారు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

12. ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించిన అఖిలేష్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను తోసిపుచ్చారు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్. అవి అధికార పార్టీ రూపొందించిన కల్పిత సర్వేలని ఆరోపించారు. బీహార్‌లో యువతకు ఉద్యోగాలు సృష్టించే ప్రగతిశీల ప్రభుత్వం ఏర్పడుతుందని, మహాకూటమి గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

13. మృతుల కుటుంబాలను పరామర్శించిన మోడీ

ప్రధాని మోడీ.. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. భూటాన్‌ పర్యటన ముగించుకొని ఢిల్లీ వచ్చిన తర్వాత పేలుడు ఘటన బాధితుల్ని పరామర్శించారు.

14. టీచర్ దారుణ ప్రవర్తన

విజయవాడలోని డాన్ బాస్కో స్కూల్‌లో పీఈటీ దారుణంగా ప్రవర్తించారు. షూ వేసుకోలేదనే కారణంతో ఆరో తరగతి విద్యార్థి తుషార్‌ను డ్రమ్ స్టిక్‌తో కొట్టాడు. దీంతో తుషార్ చేతులు వాచిపోయాయి. దీనిపై పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

15. భారత్ పై సుంకాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై సుంకాలు తగ్గించనున్నామంటూ తెలిపారు. ప్రధాని మోడీతో అద్భుతమైన అనుబంధం ఉందని పునరుద్ఘాటించారు. త్వరలో న్యాయమైన వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

16. యూనివర్సిటీకి గడువు

ప్రధాని మోదీ బ్యాచిల‌ర్స్ డిగ్రీ అంశంలో కొన‌సాగుతున్న కేసుపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని మోదీ డిగ్రీ వివ‌రాల‌ను వెల్లడించే అంశంలో ఫైలింగ్ అయిన అభ్యర్థన‌ల‌కు స్పందించాల‌ని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో త‌న అభ్యంత‌రాల‌ను దాఖ‌లు చేసేందుకు ఢిల్లీ యూనివ‌ర్సిటీకి మూడు వారాల స‌మ‌యాన్ని ఇచ్చింది కోర్టు.

17. టాలెంట్ లేదు..డొనాల్డ్ ట్రంప్

హెచ్‌-1బీ వీసాల విషయంలో కఠినంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన వైఖరిని మార్చుకున్నారు. అమెరికాకు విదేశీ ప్రతిభ అవసరమేనని స్పష్టం చేశారు. అమెరికాలో అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని అంగీకరించారు. దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాల అభివృద్ధికి విదేశీ నైపుణ్యాలు కీలకం అని చెప్పారు.

18. పెన్సిల్‌తో గోడకు రంధ్రం

రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్ గోడను ఒక వ్యక్తి పెన్సిల్‌తో సులువుగా రంధ్రం చేసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. డ్రిల్ అవసరం లేకుండానే పెన్సిల్ దిగిపోవడంతో, కోట్ల విలువైన ఇల్లు నాసిరకంగా నిర్మించారంటూ అతడు ఆరోపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

19. నేను క్షేమమే..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బాలీవుడ్ నటుడు గోవిందా తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఎక్కువ వర్కౌట్లు చేయడం వల్ల అలసిపోయానని.. యోగా, ప్రాణాయామం ఆరోగ్యానికి మంచిదని సూచించారు. నిన్న అర్థరాత్రి షూటింగ్‌లో స్పృహ కోల్పోయిన 61 ఏళ్ల గోవిందా చికిత్స అనంతరం కొన్ని గంటల కిత్రం డిశ్చార్జి అయ్యారు.

20. తను నా భార్యే.. క్రికెటర్

AFG క్రికెటర్ రషీద్ ఖాన్ 2వ పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు. ఈ ఏడాది ఆగస్టు 2న నిఖా చేసుకున్నా.. ఫొటోల్లో నా ఉన్నది నా భార్యే అని రషీద్ తెలిపారు. కానీ ప్రస్తుతం అతడు మరో యువతితో కలిసి కనిపించడంతో సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. తాను రెండో పెళ్లి చేసుకున్నానని, ఇటీవల తనతో కనిపించిన మహిళ భార్య అని సోషల్ మీడియాలో ప్రకటించారు.

 

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×