E-Paper
Advertisement

Mowgli Day 2 collections: మోగ్లీ డే 2 కలెక్షన్స్.. పాపం.. 2 కోట్లు కూడా రాలేదు

Mowgli Day 2 collections: మోగ్లీ డే 2 కలెక్షన్స్.. పాపం.. 2 కోట్లు కూడా రాలేదు
Advertisement

Mowgli Day 2 collections: ప్రముఖ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడిగా రోషన్ కనకాల(Roshan Kanakala) ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈయన కలర్ ఫోటో ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వంలో మోగ్లీ (Mowgli)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ప్రేమ కథ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రీమియర్లు ప్రసారమై 13వ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

ఈ సినిమా రెండు రోజులపాటు థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితమైంది అయితే ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్లకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.. మొదటిరోజు ప్రీమియర్లతో కలిపి. కనీసం కోటి రూపాయలు కూడా నెట్ కలెక్షన్లను కూడా రాబట్ట లేకపోయింది. ఇక రెండో రోజు కూడా భారీ స్థాయిలో బుకింగ్స్ పడిపోయాయని కలెక్షన్ల పై కూడా ప్రభావం చూపిందని తెలుస్తోంది. ఈ సినిమా రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 1.4 కోట్ల నెట్టు కలెక్షన్లను రాబట్టినట్టు సమాచారం. ఇలా రెండు రోజులకు కలిపి రెండు కోట్లు కూడా రాబట్టని నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద రోషన్ టఫ్ ఫైట్ ఎదురుకొంటున్నారని తెలుస్తోంది.

బ్రేక్ ఈవెన్ కు దూరంగా మోగ్లీ..

Advertisement

ఈ సినిమా విడుదలకు ముందు వచ్చిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేయడంతో బిజినెస్ కూడా భారీగానే జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా సక్సెస్ బాటలోకి రావాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లతో పాటు 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ కూడా రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల నిపుణులు చెబుతున్నారు.

అఖండ 2 కు పోటీగా మోగ్లీ..

Advertisement

రెండో రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 లక్షల రూపాయల కలెక్షన్స్ మాత్రమే రాబట్టినట్టు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో కలిపి ఈ సినిమా కనీసం రెండు కోట్ల కూడా చేరుకొని నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ కావడానికి కష్టంగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు పోటీగా మరోవైపు బాలకృష్ణ నటించిన ఆఖండ 2 సినిమా కూడా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలోనే కలెక్షన్ల పై ప్రభావం చూపినట్టు తెలుస్తుంది. డిసెంబర్ 25వ తేదీ మరిన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి ఇక క్రిస్మస్ సినిమాలు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే పూర్తిగా మోగ్లీ సినిమాపై ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇలాంటి టఫ్ ఫైట్ లో రోషన్ కనకాల ఏ మేరకు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుకుంటారో తెలియాల్సి ఉంది.

Also Read: Rukmini Vasanth: కాంతార ఎఫెక్ట్ బాలీవుడ్ ఛాన్సులు కొట్టేసిన రుక్మిణి వసంత్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×