Road Accident: వరుస ప్రమాదాలతో ప్రజలు మృత్యువాత పడుతున్నా.. డ్రైవర్లు మాత్రం వాళ్ల తీరు మార్చుకోవడం లేదు.. అతి వేగమే వారి లక్ష్యంగా అన్నట్లుగా ప్రవరిస్తున్నారు. అతని అతి వేగం వల్ల వారికి ఎదురుగా వస్తున్నా వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంవత్సరంగా రోడ్డు ప్రమాదాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అంటే అంత నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. అలాగే నేడు మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామం వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బాధితుడు అమాంతం గాల్లోకి ఎగిరిపడి, అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతుడిని కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీధర్‌గా గుర్తించారు.
అయితే ఆయన చిన్న ఘనపూర్ మండలంలోని ఐఎంఎల్ (IML) డిపోలో హమాలీగా పనిచేస్తున్నారు. ఉదయం వేళ విధుల నిమిత్తం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన దృశ్యాలు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఫుటేజీ ఆధారంగా, డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Also Read: మెడికల్ కాలేజీల కోసం వైసీపీ ప్రజా యుద్ధం.. నేడు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు
సమాచారం అందుకున్న వెంటనే కొల్చారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ ఆధారంగా కారు డ్రైవర్‌పై చర్యలు చేపట్టడానికి దర్యాప్తు ప్రారంభించారు.
నడుచుకుంటూ వెళ్తుండగా ఢీకొట్టిన కారు.. అమాంతం గాల్లోకి ఎగిరిన వ్యక్తి
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో ఘటన
రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి కారు ఢీ కొట్టడంతో స్పాట్ లోనే మృతి
మృతుడు హైదరాబాద్ గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన శ్రీధర్ గా… pic.twitter.com/LVDaRQL7Ce
— BIG TV Breaking News (@bigtvtelugu) December 15, 2025