E-Paper
Advertisement

Rukmini Vasanth: డేటింగ్ లో కాంతార నటి రుక్మిణి వసంత్..క్లారిటీ వచ్చేసిందిగా!

Rukmini Vasanth: డేటింగ్ లో కాంతార నటి రుక్మిణి వసంత్..క్లారిటీ వచ్చేసిందిగా!
Advertisement

Rukmini Vasanth: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వినపడుతుంటాయి. ఆ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది, లేదనే విషయాలు పక్కన పెడితే నిత్యం ఎన్నో రకాల రూమర్ల ద్వారా సెలబ్రిటీలు వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటి రుక్మిణి వసంత్ సైతం డేటింగ్ రూమర్ల ద్వారా రెండు రోజులుగా సోషల్ మీడియా వార్తలలో నిలిచారు. రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ప్రస్తుతం సౌత్   సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే.

రిలేషన్ లో రుక్మిణి వసంత్..

ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రుక్మిణి వసంత్ ఇటీవల సిద్ధాంత్ నాగ్(Siddanth Nag) అనే వ్యక్తితో చాలా చనువుగా ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి రుక్మిణి వసంత్ కూడా రిలేషన్ లో ఉందా? అంటూ ఈ ఫోటో పై ఆమె అభిమానులు స్పందిస్తూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతుంది. ఇలా రుక్మిణి వసంత్ డేటింగ్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై ఆమె టీం స్పందించారు. రుక్మిణి వసంత్ సిద్ధాంత్ నాగ్ గురించి వస్తున్న డేటింగ్ వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.

సిద్ధాంత్ నాగ్ స్నేహితుడు మాత్రమే..

Advertisement

రుక్మిణి సిద్ధాంత్ ఇద్దరు మంచి స్నేహితులని తెలుస్తుంది .ఆయన ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నట్టు సమాచారం. ఇకపోతే రుక్మిణి సిద్ధాంత్ తో  కలిసి దిగిన ఈ ఫోటో 2023వ సంవత్సరానికి సంబంధించినదని తెలుస్తోంది .అయితే అప్పటి ఫోటోని ఇప్పుడు వైరల్ చేస్తూ ఈమె డేటింగ్ లో ఉన్నారనే వార్తలను తెరపైకి తీసుకురావడంతో ఈ వార్తలకు పులి స్టాప్ పెట్టేశారు. దీంతో ఈ వార్తలలో నిజం లేదని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రుక్మిణి వసంత్ విషయానికి వస్తే..

ఎన్టీఆర్ డ్రాగన్..

Advertisement

ఈమె సప్త సాగరాలు దాటి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే పర్వాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార చాప్టర్ 1 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో రుక్మిణి పేరు కూడా మారుమోగుతుంది. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలలో కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో పాటు యష్ టాక్సిక్ సినిమాలో కూడా రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈమె ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా అవకాశాన్ని అందుకున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు.

Also Read: Babu Mohan: బాబు మోహన్ కు చేదు అనుభవం.. వాగ్వాదానికి దిగిన ఎన్టీఆర్ అభిమానులు!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×