E-Paper
Advertisement

Saanve Megghana: ఎప్పుడు జుట్టు గురించే ఆలోచనలు.. పాపం ఈ హీరోయిన్ బాధ చూశారా..!

Saanve Megghana: ఎప్పుడు జుట్టు గురించే ఆలోచనలు.. పాపం ఈ హీరోయిన్ బాధ చూశారా..!
Advertisement

Saanve Megghana: హీరోయిన్.. సాన్వే మెగ్గానా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో సాన్వే చాలా సింపుల్‌గా.. వైట్ డ్రెస్.. లో కనిపిస్తూనే కుర్రకారుల మనసుని ఆకట్టుకుంది. జుట్టును మెల్లగా పట్టుకుని.. కెమెరాకు కాస్త పక్కగా చూస్తూ ఉన్న ఆమె లుక్.. చూసిన వెంటనే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా..ఆమె ముఖంలో కనిపించే స్మైల్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఈ ఫోటోకు సాన్వే ఇచ్చిన క్యాప్షన్ కూడా చాలా సరదాగా ఉంది. “ఎప్పుడూ జుట్టు గురించే ఆలోచనలు… ఏ స్టైల్‌కి మీ అప్రూవల్?” అన్న అర్థం వచ్చేలా ఆమె క్యాప్షన్ రాసుకు వచ్చింది. దీనిపై అభిమానులు సరదా కామెంట్లు చేస్తున్నారు. కొందరు “ఈ హెయిర్ స్టైల్ బాగుంది” అంటుంటే, మరికొందరు “ఏ స్టైల్ అయినా మీకు బాగానే ఉంటుంది” అంటూ స్పందిస్తున్నారు.

Advertisement

 

Advertisement

సినీ కెరీర్ విషయానికి వస్తే.. సాన్వే మెగ్గానా క్రమంగా మంచి అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. పిట్ట కథలు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన..ఆమెకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా కుడుంబస్థన్. ఈ తమిళ..సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడంతో పాటు మంచి గుర్తింపూ లభించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి.

ఇప్పుడు సాన్వే ఒక కొత్త రొమాంటిక్ కామెడీ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాకు దర్శకుడు హరిహరసుతన్ అళగిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాతగా అరుణ్ విశ్వా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను శాంతి టాకీస్ ప్రొడక్షన్ నంబర్ 4గా ప్రస్తుతానికి.. పిలుస్తున్నారు.

 

ఈ సినిమాలో హీరోగా యూట్యూబర్ నుంచి నటుడిగా మారిన భారత్ నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో హాస్యం..భావోద్వేగాలు..పల్లెటూరి జీవన శైలి అందంగా చూపించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో సాన్వే పాత్ర చాలా కీలకంగా ఉండనుందని సమాచారం.

ఇక ఈ చిత్రంలో నటుడు బాల సరవణన్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మిగతా నటీనటులు.. సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో సినిమాల్లో మంచి అవకాశాలతో కొనసాగుతున్న ఈ హీరోయిన్ ఇప్పుడు.. తను ఇన్‌స్టాగ్రామ్‌లో తన సింపుల్ స్మైల్‌తో మరోసారి ఆమె అభిమానులను.. మరింత ఆకట్టుకుంది.

ALSO READ: Jetlee Trailer Review: గాల్లోనే గందరగోళం… సత్య స్టైల్‌లో జెట్‌లీ ట్రైలర్ అదుర్స్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×