Romantic Comedy OTT : రకుల్ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ పెళ్లి తరువాత ఈ బ్యూటీ కంప్లీట్ గా టాలీవుడ్ ను పక్కన పెట్టేసింది. రకుల్ సినిమాలను మిస్ అవుతున్న అభిమానులు, అప్పుడప్పడూ ఓటీటీలోకి వచ్చే ఆమె ఇతర భాషల సినిమాలను చూసి సరిపెట్టుకుంటున్నారు. అలా రకుల్ సినిమాల గురించి ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. రీసెంట్ గా ఆమె చేసిన రొమాంటిక్ కామెడీ డ్రామా ఒకటి డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. మరి ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆర్. మాధవన్ నటించిన “దే దే ప్యార్ దే 2” ఇప్పుడు OTT విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి అన్షుల్ శర్మ దర్శకత్వం వహించారు. లవ్ రంజన్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మించారు. ఈసారి మొదటి భాగంలో కీలక పాత్ర పోషించిన టబు ఈ చిత్రంలో కనిపించదు. ఓటీటీలో ఈ సీక్వెల్ కు మంచి రెస్పాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు మూవీ మేకర్స్.
ఈ చిత్రం 2025 నవంబర్ 14న థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద దాదాపు 74.17 కోట్లు వసూలు చేసింది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత, మేకర్స్ డిజిటల్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తమ ఓటీటీలో రాబోతున్న కమింగ్ సూన్ అనే కేటగిరీ లిస్ట్ లో అఫిషియల్ గా ప్రకటించింది. మరి ఈ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.
Read Also : ఓటీటీలోకి వచ్చేసిన సెన్సేషనల్ కోర్టు రూమ్ డ్రామా ‘హక్’… అస్సలు మిస్ అవ్వొద్దు భయ్యా
ఈ సినిమా కథ మొదటి భాగం ముగిసిన చోటే స్టార్ట్ అవుతుంది. ఇందులో అజయ్ దేవగన్ మరోసారి ఆశిష్ మెహ్రా అనే మధ్య వయస్కుడైన ఎన్ఆర్ఐగా నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ అతని స్నేహితురాలు ఆయేషా పాత్రను పోషించింది. ఈసారి ఆశిష్ ఆయేషాను వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేస్తాడు. అందుకోసం ఆమె తల్లిదండ్రుల అనుమతి కోరడానికి ఆయేషా ఇంటికి వచ్చినప్పుడు కథలో ఊహించని మలుపు వస్తుంది.
ఈ చిత్రంలో ఆయేషా తండ్రిగా ఆర్. మాధవన్ నటించాడు. ఆయన తనను తాను ఆధునిక మనస్తత్వం కలిగిన వ్యక్తిగా భావిస్తాడు. కానీ తన కుమార్తె, ఆశిష్ మధ్య ఉన్న వయసు వ్యత్యాసాన్ని అంగీకరించలేక పోతాడు. గౌతమి కపూర్ ఆయేషా తల్లిగా నటించగా, మీజాన్ జాఫ్రీ ఆయేషా బాల్య స్నేహితుడు ఆదిగా నటించాడు. తమ కూతురు ఆయేషాకు ఆశిష్ కంటే ఆది బెటర్ ఆప్షన్ అని అనుకుంటారు హీరోయిన్ తల్లిదండ్రులు. ఈ చిత్రం అపార్థాలు, కామెడీ సీన్స్ తో సాగుతుంది స్టోరీ. ఆయేషా తన స్వంత నిర్ణయాలను గౌరవించడం నేర్చుకునే స్థాయికి కథ చేరుకుంటుంది. మరి ఇంతకీ ఆయేషా తీసుకున్న నిర్ణయం ఏంటి ? ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా ఇద్దరి పెళ్లి జరిగిందా ? క్లైమాక్స్ ఏంటి? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.