E-Paper
Advertisement

నిద్రపై సద్గురు సంచలన కామెంట్స్ .. షాక్‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా!

నిద్రపై సద్గురు సంచలన కామెంట్స్ .. షాక్‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా!
Advertisement

Sadhguru :నిజంగా ఒక మనిషికి ఎన్ని గంటల నిద్ర కావాలి అంటే ఎవరైనా ఏమంటారు. 8 గంటలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అంటారు. కనీసం ఆ మాత్రం లేకపోతే తెల్లారి సరిగ్గా పని చేయలేమని,హెల్త్ పాడైపోతుందని చెబుతుంటారు. కానీ నాకు మాత్రం 2 నుంచి 3 గంటలు మాత్రమే సరిపోతుంది అంటూ షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చారు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్. అవును.. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌తో ఆయన ముచ్చటిస్తూ ఇలా తన స్లీపింగ్ టైమ్ పై అసలు విషయం చెప్పుకొచ్చారు.

కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే నిద్ర

Advertisement

కార్యక్రమంలో భాగంగా నిద్ర గురించి వచ్చిన చర్చ సందర్భంగా ఆలియా భట్ చాలా క్యాజువల్‌గా “మీరు రోజుకు ఎన్ని గంటలు పడుకుంటారు?” అని సద్గురును అడిగింది. దానికి ఆయన గత 28 ఏళ్లుగా తాను రోజుకు కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే నిద్రపోతున్నానని చెప్పడంతో నోరెళ్లబెట్టడం ఆలియా వంతు అయింది. అయితే రెండేళ్ల కిందట జరిగిన యాక్సిడెంట్ కారణంగా తలకు రెండు సార్లు సర్జరీ జరిగింది అని, అప్పుడు డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ కారణంగా కొన్నాళ్లు ఎక్కువ సేపు పడుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఇక ప్రస్తుతం మాత్రం 3 నుంచి 4 గంటలు నిద్రపోతున్నానని చెప్పడంతో ఇది విన్న ఆలియాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. “అంతేనా?” అని షాక్ అవుతూ తాను మాత్రం కనీసం 8-9 గంటలు నిద్రపోవడానికి ట్రై చేస్తానని, డాక్టర్లు కూడా అదే చెబుతారు కదా అని క్వశ్చన్ రైజ్ చేసింది ఆలియా.

also read:వేదికపైనే వెక్కి వెక్కి ఏడ్చిన జెనీలియా.. ఎందుకో తెలుసా?

Advertisement

బాడీని అంతగా డ్యామేజ్ చేసుకునేలా ఎందుకు

దానికి సద్గురు ఉన్న టైమ్ అంతా నిద్రపోవడానికే కేటాయిస్తే ఇక ఎప్పుడు జీవిస్తారని, అసలు మనం ఎంత సేపు పడుకున్నామన్నది కాదని మేల్కునప్పుడు ఎంత యాక్టివ్ గా బాడీని ఉంచుతామనేదే ముఖ్యమని వివరించారు. రోజంతా కష్టపడ్డాక బాడీకి రెస్ట్ కావాలి కదా అని ఆలియా అంటే.. అసలు బాడీని అంతగా డ్యామేజ్ చేసుకునేలా ఎందుకు వర్క్ చేయాలి? అన్న లాజిక్ తీశారు సద్గురు. ముఖ్యంగా అనవసరమైన ఆందోళనలు, ఒత్తిడి పెంచుకుంటేనే శరీరం త్వరగా అలసిపోతుందని, మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే తక్కువ నిద్రతోనే ఫుల్ ఎనర్జీతో ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే, ఎక్కువగా నిద్రపోయే వాళ్లు జీవితాన్ని ఫేస్ చేయలేక పారిపోతున్నట్టే అని చెప్పిన మాటలు ఎందరికో మోటివేషన్ ఇచ్చేవే.

ఈ టిప్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో

ఇక ఆలియా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వస్తున్న ‘లవ్ అండ్ వార్’ సినిమాలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌తో కలిసి నటిస్తోంది. మరో వైపు యష్ రాజ్ ఫిల్మ్స్ ఫస్ట్ ఫిమేల్ స్పై మూవీ ‘ఆల్ఫా’ ఉండనే ఉంది. ప్రమోషన్స్ అంటూ ఇంత బిజీగా ఉండే ఆలియాకు.. సద్గురు ఇచ్చిన ఈ టిప్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి!

also read:ప్రకాష్ రాజ్ వర్సెస్ సోషల్ మీడియా.. రాముడిపై వ్యాఖ్యలా? ఇక సినిమాల్లో నో ఛాన్స్!.. పాన్ ఇండియా లెవల్లో ‘బ్యాన్’ సెగ!

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×