E-Paper
Advertisement

వేదికపైనే వెక్కి వెక్కి ఏడ్చిన జెనీలియా.. ఎందుకో తెలుసా?

వేదికపైనే వెక్కి వెక్కి ఏడ్చిన జెనీలియా.. ఎందుకో తెలుసా?
Advertisement

Genelia D’Souza:‘వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ’ అంటూ యూత్ గుండెల్లో చెరగని స్టాంప్ దింపేసిన బొమ్మరిల్లు హాసిని… అదేనండి జెనీలియా తాజాగా ఓ స్టేజ్ పై వెక్కి వెక్కి ఏడ్చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అవును.. ఎప్పుడు సరదాగా నవ్వుతూ గెంతులేస్తూ ఉండే జెన్నీ ఒక్కసారిగా కళ్లల్లోకి నీళ్లు తెచ్చేసుకోవడంతో షాక్ అయ్యారు ఫ్యాన్స్.

కళ్లలోకి నీళ్లు తెచ్చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చేసిన  జెనీలియా

Advertisement

విషయంలోకి ఎంట్రీ ఇస్తే తాజాగా ‘రాజా శివాజీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబాయ్ లో ఘనంగా జరిగింది. మామూలుగా అన్ని ఈవెంట్ల లాగే ఇదీ అయితే జెనీలియా ఇంత ఎమోషనల్ అయ్యేది కాదు. ఇది తన భర్త రితేష్ దేశ్ ముఖ్ కళల ప్రాజెక్ట్ అవడం, రితేష్ తన తండ్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను గుర్తు చేసుకోవడం, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ నిర్మించడం కోసం ఎన్ని కష్టాలు పడ్డాను అనేది గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవడంతో ఒక్కసారిగా కళ్లలోకి నీళ్లు తెచ్చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది జెనీలియా. స్వయంగా తన భర్త పడ్డ శ్రమను కళ్లారా చూసిన ఆమె, స్టేజ్ మీదనే అందరి ముందూ కన్నీరు పెట్టుకోవడంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఎమోషనల్ అయ్యారు. దీంతో రితేష్-జెనీలియా జంట మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి ఇదీ కదా నిజమైన ప్రేమంటే అంటూ పొగిడేస్తున్నారు నెటిజనులు. ఇక అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్ కి సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్ వంటి టాప్ స్టార్ అటెండ్ కావడం విశేషం.

also read:ప్రకాష్ రాజ్ వర్సెస్ సోషల్ మీడియా.. రాముడిపై వ్యాఖ్యలా? ఇక సినిమాల్లో నో ఛాన్స్!.. పాన్ ఇండియా లెవల్లో ‘బ్యాన్’ సెగ!

Advertisement

మే 1, 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్

ఇక సినిమా విషయానికి వస్తే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ సినిమాని హిందీ, మరాఠీ భాషల్లో ఒకేసారి షూట్ చేశారు. ఇక సినిమాలో సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, భాగ్యశ్రీ వంటి స్టార్స్ నటించగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘జీవ మహాల’ అనే కీలక పాత్రలో కనిపిస్తుండటం సినిమాకే హైలెట్.ఇక హైలీ టెక్నికల్ స్టాండర్స్ తో తెరకెక్కుతున్న ఈ ‘రాజా శివాజీ’ చిత్రం మే 1, 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

 రితేష్ దేశ్ ముఖ్ ఎన్ని కోట్లు కొల్లగొడతాడో

ఇక ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంబాజీ కథ ఆధారంగా ఛావా అంటూ విక్కీ కౌశల్ సినిమా తీసి వెయ్యి కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇక అప్పుడెప్పుడో 2022లో ‘పావన్‌ఖిండ్’ (Pawankhind) అంటూ దిగ్పాల్ లాంజేకర్ (Digpal Lanjekar) దర్శకత్వంలో వచ్చిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించినదే. శివాజీ మహారాజ్ పాత్రలో చిన్మయ్ మాండ్లేకర్ (Chinmay Mandlekar) నటించిన తీరుకి మెస్మరైజ్ అయిపోయారు ఆడియన్స్.ఇక శివాజీ మహారాజ్ నమ్మకమైన సైన్యాధిపతి తాన్హాజీ చుట్టూ అల్లిన కథతో అజయ్ దేవగన్ తాన్హాజీ (Tanhaji: The Unsung Warrior) అనే సినిమా ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చి మంచి వసూళ్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈసారి శివాజీ కథ ఆధారంగా రితేష్ దేశ్ ముఖ్ ఎన్ని కోట్లు కొల్లగొడతాడో. ఏది ఏమైనా బాక్సాఫీస్ వద్ద శివాజీ మహారాజ్ హిస్టరీని మన మేకర్స్ భారీగానే వాడుకునే పనిలో పడ్డారన్నమాట.

also read:అవకాశాలు రాని వారికి అండగా చదలవాడ.. దర్శకుల సంఘంలో కొత్త విప్లవం.. రూ. 30 కోట్లతో భారీ ప్రాజెక్ట్!

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×