Prakash Raj:’నేను మోనార్క్.. నన్నెవడూ మోసం చేయలేడు’ అంటూ సిల్వర్ స్క్రీన్ ని చెడుగుడు ఆడుకునే ప్రకాష్ రాజ్ ని ఇప్పుడు చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజనులు. అవును.. కంటెంట్ తక్కువ.. కాంట్రవర్సీలు ఎక్కువ అన్నట్టుగా సినిమాలు అడపా దడపా చేస్తూ వివాదాలతో తెగ సావాసం చేస్తున్న ఈ వెర్సటైల్ యాక్టర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే మొన్నామధ్య ప్రకాష్ రాజ్ ఒక కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో శ్రీరాముడు వలస కూలీ, రామాయణం అంతా ఒక బూటకం అన్నట్టుగా స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అప్పుడెందుకు రియాక్ట్ అవలేదు
ఇక ఆనాడు అంటుకున్న ఈ మంటలు ఇప్పటికీ చల్లారట్లేదు కదా పైపెచ్చు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. దేశం మొత్తం కొలిచే శ్రీరాముడిని అలా అవమానిస్తావా అంటూ ఇప్పటికే ఇటు ఇండస్ట్రీలోనూ, అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఎంతో మంది దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. ఇక ఎంతో మంది భక్తులు, హిందూ సంఘాలు, బిజెపి నాయకులు ప్రకాష్ రాజ్ పై కేసులు పెడుతూనే ఉన్నారు. ఒక పక్క ఈ రచ్చ జరుగుతుండగానే మరో పక్క ఆయన్ని సినిమాల్లో బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా ఈ మధ్య దేశంలో జరిగిన టీసీఎస్ లవ్ జిహాద్ ఇష్యూ పై, అలాగే మహారాష్ట్రలో 180 మంది హిందూ అమ్మాయిల వీడియోల రికార్డింగ్ ఇన్సిడెంట్ పై ఏ మాత్రం రియాక్ట్ కాని ప్రకాష్ రాజ్ హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసి ఎగతాళి చేయడంలో మాత్రం ముందుంటాడని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. స్వయంప్రకటిత మేధావిగా ఫీలయ్యే ఆయన హిందూ ప్రజల మనోభావాలను దెబ్బ తీయడమే పనిగా పెట్టుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
also read:సోషల్ మీడియాలో రెచ్చిపోతే జైలుకే.. అనసూయపై అసభ్య కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్ట్.. పూర్తి వివరాలివే!
#BanPrakashRaj అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్
ఇలా మెజారిటీ ప్రజల డబ్బుతో పాపులారిటీని, కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించిన ప్రకాష్ రాజ్ అదే మెజారిటీ ప్రజల మత విశ్వాసాలను ఎగతాళి చేస్తున్నాడని అందుకే ఆయన్ని అసలు సినిమాల్లోకి తీసుకోవద్దు అంటూ #BanPrakashRaj అనే హ్యాష్ ట్యాగ్ ని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా స్టార్ డైరెక్టర్లు రాజమౌళి చెక్కుతున్న వారణాసి నుండి, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ నుండి, అలాగే అజయ్ దేవగన్ తీస్తున్న బాలీవుడ్ మూవీ ‘దృశ్యం 3’ నుంచి ఆయన్ని బాయ్ కాట్ చేయాలన్న డిమాండ్ ఇప్పుడు గట్టిగా ఊపందుకుంది.
వివాదాలు కొత్త కాదు
ఇదిలా ఉండగా గతంలో పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సమయంలో ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ విషయంలోనూ ప్రకాష్ రాజ్ తీరుపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కో ఆర్టిస్ట్ ల పట్ల సరిగ్గా వ్యవహరించలేదన్న కారణంతో మా అసోసియేషన్ అప్పట్లోనే బ్యాన్ చేయగా, ఆ తర్వాత మెగాస్టార్ మధ్యలో జోక్యం చేసుకోవడంతో ఆ బ్యాన్ తొలగించబడింది. అయితే ఈసారి ఇష్యూ హిందూ మతానికి, అందునా రాముడికి సంబంధించినది కావడంతో పరిస్థితులు చేయి దాటిపోయేలా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో హిందూ మతానిపై అంత అక్కసు ఉన్నవాడివి హిందూ వాళ్ల సినిమాల్లో ఎందుకు నటించాలి అంటూ దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీలు ఆయన్ని బహిష్కరించాలనే ‘బ్యాన్ ప్రకాష్ రాజ్’ నినాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఇప్పటికే ఎన్నో పోలీస్ స్టేషన్ లలో కేసులు ఫైల్ అవడంతో తాను నటిస్తున్న సినిమాలు కూడా లీగల్ ఇష్యూలో ఇరుక్కునేలానే కనిపిస్తున్నాయి. చూడాలి మరి మేకర్స్ ప్రకాష్ ని తీసేసి మరో వ్యక్తితో రీ షూట్ చేస్తారా.. లేక ఏదైతే అది అయిందని అలాగే కంటిన్యూ చేస్తారా.. కాలమే డిసైడ్ చేయాలి!
also read:ఉత్తరాంధ్రలో ‘పెద్ది’ ఊచకోత షురూ.. 23 కోట్లతో చరణ్ రేంజ్ మామూలుగా లేదుగా!