Sai Dharam Tej:మెగా మేనల్లుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి హిట్స్ సొంతం చేసుకొని సుప్రీం హీరోగా పేరు దక్కించుకున్న ఈయన..ఇప్పుడు మళ్లీ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. మరొకవైపు వ్యక్తిగతంగా ఒంటి మీదకు 40 ఏళ్లు వచ్చినా ఇంకా వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ కెరియర్ సాగిస్తున్నారు. అయితే అలాంటి ఈయన ఇప్పుడు వివాహానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎంగేజ్మెంట్ కి సంబంధించిన డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న సాయి ధరంతేజ్ నవంబర్ 5వ తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఘనంగా నిశ్చితార్థం జరుపుకోబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరువర్గాల మధ్య చర్చలు ముగిసాయని, ఇక నిశ్చితార్థమైన రెండు నెలలోపే వివాహం కూడా జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే సాయి ధరంతేజ్ ఎవరిని వివాహం చేసుకోబోతున్నారు? అంటూ వార్తలు రాగా, తన చిన్ననాటి స్నేహితురాలిని ఆయన వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఆమె వృత్తి, ఇతర వివరాలు ఏవి తెలియనప్పటికీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే బ్యాచిలర్ లైఫ్ ను వీడి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు రావడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు.
also read:ఘనంగా భూమి పూజతో మొదలైన వరుణ్ తేజ్ ‘ బరి’!
సాయి ధరంతేజ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం సంబరాల ఏటి గట్టు. డైరెక్టర్ రోహిత్ కేపీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తిచేసుకుంది. బ్లాక్ బస్టర్ హనుమాన్ మూవీ ని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇకపోతే ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందం ఒక బిహైండ్ ద సీన్స్ వీడియోని విడుదల చేశారు. సినిమా కోసం రూపొందించిన భారీ సెట్స్, రా అగ్రేషన్ తో కూడిన యాక్షన్ సన్నివేశాలు, టీమ్ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ను ఇందులో చూపించారు.
ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు ధనుంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, నరేష్ బి కృష్ణ, సాయికుమార్, శ్రీకాంత్ , అనన్య నాగళ్ళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.