E-Paper
Advertisement

‘సంబరాల ఏటిగట్టు’కి బడ్జెట్ బ్రేకులు.. 2026లో కూడా కష్టమేనా?

‘సంబరాల ఏటిగట్టు’కి బడ్జెట్ బ్రేకులు.. 2026లో కూడా కష్టమేనా?

Sai Durgha tej:సాయి దుర్గ తేజ్ …మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో కెరీర్ మూడడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. అప్పుడెప్పుడో మూడేళ్ళ కిందట ‘బ్రో’ అంటూ పలకరించిన తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ప్రస్తుతం ఈ సినిమాకి బడ్జెట్ బ్రేకులు పడ్డట్టు తెలుస్తుంది.

బడ్జెట్ విషయంలో  తీవ్రమైన ఇబ్బందులు

సినిమా బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయడానికి కావాల్సిన బడ్జెట్ విషయంలో నిర్మాత నిరంజన్ రెడ్డికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయట. నిధులు సమకూరితే తప్ప కెమెరా ముందుకు కదిలేలా లేదన్నది ఇండస్ట్రీ టాక్. దీంతో ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్న సాయి దుర్గ తేజ్ కెరీర్ మొత్తం ఇపుడు రిస్క్ లో పడిపోయిందట.అవును పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తేజు పొడవాటి గడ్డం, హెయిర్ పెంచగా ఇపుడు అవే వేరే సనిమాలు చేసేందుకు అడ్డంకిగా మారాయట. అతని కోసం ఇతర దర్శకులు మంచి మంచి స్టోరీలతో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నా సంబరాల ఏటిగట్టుకి ‘గుమ్మడికాయ’ కొట్టే వరకు ఆ లుక్ మార్చే అవకాశం లేకపోవడంతో మంచి మంచి ఆఫర్స్ మిస్ అవుతున్నాడట.

ఓటిటి, డబ్బింగ్ డీల్స్ రైట్స్ లెక్కలు తలకిందులు

మరోవైపు సినిమా డిలే అవుతున్న కొద్దీ సినిమాకి జరగాల్సిన బిజినెస్ కూడా ఇపుడు తారుమారు అవుతుందట. యస్ ..అనుకున్న దానికన్నా వర్కింగ్ డేస్, బడ్జెట్ పెరిగిపోవడంతో ఓటిటి, డబ్బింగ్ డీల్స్ రైట్స్ విషయంలో లెక్కలు తలకిందులు అవుతున్నాయని సమాచారం.ఇక ఇదే పరిస్థితి మేనమామ చిరంజీవి విశ్వంభరకి ఎదురవుతున్న సంగతి తెల్సిందే. అంటే మేనమామ సినిమా బాటలోనే మేనల్లుడు నడవనున్నాడన్న మాట.

థియేటర్లపై దండయాత్ర

ఇప్పటికే 2026 మొదలై మే కూడా వచ్చేసింది. అయినా సినిమా రిలీజ్ ఎప్పుడన్న విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవడం గమనార్హం. చూస్తే ఈ ఇయర్ లో చాలా సినిమాలు థియేటర్లపై దండయాత్ర చేసేందుకు రెడీగా ఉన్నాయ్.మే మరియు జూన్ నెలల్లో ‘పెద్ది’, ‘స్వయంభు’, ‘టాక్సిక్’, ‘లెనిన్’ సినిమాలు థియేటర్లను ఆక్యుపై చేసేందుకు రెడీ అవగా ఆగస్ట్ నెలలో ‘భోగి’ రజనీకాంత్ ‘జైలర్ 2’తో పాటు మరిన్ని వచ్చేందుకు రెడీ అయ్యాయని తెలుస్తుంది.

నవంబర్‌లో ‘రామాయణ’ డిసెంబర్‌లో  ‘ఫౌజీ’

మరో వైపు సెప్టెంబర్, అక్టోబర్ లో పలు సినిమాలు వచ్చేందుకు ప్లాన్  వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నవంబర్‌లో భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ డిసెంబర్‌లో ప్రభాస్ ‘ఫౌజీ’ ఉండనే ఉన్నాయ్.మరి ఇంతటి బిజీ షెడ్యూల్ లో ‘సంబరాల ఏటిగట్టు’కి అసలు చోటు ఎక్కడ ఉంటుందన్నది పెద్ద ప్రశ్న. పాత టీజర్లు, పోస్టర్లతో కాలక్షేపం చేస్తే కామన్ ఆడియెన్స్ లో ఆసక్తి సున్నా అవడం పక్కా. ఇక పోయినేడు వదిలిన గ్లిమ్ప్స్ ని ఆడియన్స్ ఇప్పటికే మర్చిపోయారు కూడా.చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్న ఈ బడ్జెట్ బ్రేకులపై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో !

also read :తండ్రి రివెంజ్ మామూలుగా లేదుగా.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న క్రేజీ థ్రిల్లర్!

Related News

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

Big Stories

×