E-Paper
Advertisement

గూగుల్‌ను షేక్ చేసిన మర్డర్ మిస్టరీ… ఓటీటీలో మతి పోగొడుతున్న క్రేజీ వెబ్ సిరీస్

గూగుల్‌ను షేక్ చేసిన మర్డర్ మిస్టరీ… ఓటీటీలో మతి పోగొడుతున్న క్రేజీ వెబ్ సిరీస్
Advertisement

Biographical Drama OTT : గత ఏడాది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ఓటీటీలో సంచలనం రేపుతోంది. అమెరికాకు చెందిన అమండా నాక్స్ అనే యువతి, తన స్నేహితురాలి మర్డర్ కేసులో ఇటలీలో జైలుకు వెళ్తుంది. 2007లో జరిగిన ఈ హత్య అప్పట్లో ఒక సంచలనం అయింది. గూగుల్‌ లో కూడా దీని గురించి చాలా మంది సర్చ్ చేయడం కూడా జరిగింది. ఆమె సుదీర్ఘ న్యాయపోరాటం, ఆమె తల్లిదండ్రులు తన బిడ్డ కోసం చేసిన పోరాటాన్ని ఇందులో చాలా ఎమోషనల్ గా చూపిస్తారు. ఈ సిరీస్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది.

హులు (Hulu) లో స్ట్రీమింగ్

ఈ బయోపిక్ డ్రామా పేరు ‘ది ట్విస్టెడ్ టేల్ అమండా నాక్స్’ (The Twisted Tale of Amanda Knox). దీనికి అమండా స్వయంగా నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఆమె ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి వాషింగ్టన్‌లో నివసిస్తోంది. 2007లో ఇటలీలోని పెరూజియాలో అమండా నాక్స్ తన రూమ్‌మేట్ మెరెడిత్ కెర్చర్‌ను హత్య చేసిందనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యింది. అమెరికాకు చెందిన అమండా, తన ప్రియుడు రాఫెల్ సోలెసిటోతో కలిసి ఈ హత్య చేసిందని పోలీసులు నమ్మారు. 2009లో అమండాకు 26 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమెను మీడియా కూడా ఒక విలన్‌లా చిత్రించింది. 2025 లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ హులు (Hulu) ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అమెరికాకు చెందిన అమండా నాక్స్, ఉన్నత చదువుల కోసం ఇటలీకి వెళ్ళింది. అయితే ఒకరోజు అక్కడ ఆమె ఉంటున్న గదిలోనే తన స్నేహితురాలు మెరెడిత్ కెర్చర్ దారుణంగా హత్యకు గురైంది. ఆ సమయంలో సరైన ఆధారాలు లేకపోయినా, పోలీసులు అమండానే నిందితురాలని అనుమానించి అరెస్టు చేస్తారు. మీడియా కూడా ఆమెను ఒక నేరస్తురాలిగా చిత్రీకరించడంతో ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అమండాకు మొదట 26 ఏళ్ల జైలు శిక్ష పడింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఆమె జైలులోనే గడిపింది. అయితే ఆమె తరపు న్యాయవాదులు పోరాడి, పోలీసులు సేకరించిన సాక్ష్యాలు తప్పు అని నిరూపించారు. ఆ తర్వాత జరిగిన విచారణల్లో ఆమె నిర్దోషి అని తేలడంతో 2011లో జైలు నుంచి విడుదలై తిరిగి అమెరికాకు చేరుకుంది.

కానీ ఆమె పోరాటం అక్కడితో ఆగలేదు. ఇటలీ కోర్టులు మళ్లీ మళ్లీ ఈ కేసును తిరగదోడినా, చివరకు 2015లో ఆమెను పూర్తి నిర్దోషిగా ప్రకటించాయి. కేవలం అనుమానంతో ఒక విదేశీ యువతిని ఎలా ఇబ్బంది పెట్టారో ఈ కథ నిరూపిస్తుంది. ప్రస్తుతం ఆమె ఒక రచయిత్రిగా, యాక్టివిస్ట్‌గా తనలాంటి బాధితుల కోసం పనిచేస్తోంది. అయితే రూడీ గుడే అనే ఐవరీ కోస్ట్ దేశస్థుడి వేలిముద్రలు, ఘటనా స్థలంలో దొరికాయి. దీంతో ఈ కేసులో అతనికి 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతను దాదాపు 13 ఏళ్లు జైలులో ఉండి, 2021లో విడుదలయ్యాడు. కానీ అతను కూడా ఈ హత్య నేను చేయలేదని ఇప్పటికీ వదిస్తున్నాడు.

రచయిత్రిగా సెకండ్ జర్నీ  

Advertisement

అమండా నాక్స్ ప్రస్తుతం ఒక రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా తన జీవితాన్ని కొనసాగిస్తోంది. 2025లో విడుదలైన “Free: My Search for Meaning” అనే తన కొత్త పుస్తకం ద్వారా, జైలు నుండి విడుదలయ్యాక ఎదురైన సవాళ్లను, తన వ్యక్తిగత ఎదుగుదలను ప్రపంచానికి వివరించింది. ప్రస్తుతం ఆమె “Labyrinths” అనే పాడ్‌కాస్ట్ నడుపుతూ, తప్పుడు కేసుల్లో ఇరుక్కుని అన్యాయంగా శిక్షలు అనుభవిస్తున్న బాధితుల పక్షాన పోరాడుతోంది.

Read Also : మార్చురీ నుండి మాయమైన మృతదేహం…క్లైమాక్స్ లో ఊహించని షాకింగ్ ట్విస్ట్… ఐయండిబిలో 7.6 రేటింగ్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×