Valathu Vashathe Kallan:ఎన్ని ఇండస్ట్రీల నుండి ఎన్ని సినిమాలొచ్చినా మలయాళం నుండి వచ్చే సినిమాల కుండే క్రేజే వేరు. ముఖ్యంగా భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్ అంటూ హడావిడి చేయకుండా ఎంగేజింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ని హుక్ చేసే థ్రిల్లర్స్ కి మల్లూ వుడ్ పెట్టింది పేరు. ఇక ‘దృశ్యం’ వంటి సెన్సేషన్ మూవీతో నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిన మాస్టర్ మైండ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ నుండి సినిమా వస్తుందంటే అంచనాలు ఇంకే రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు.ఇక ప్రస్తుతం ఆయన్నుండి వచ్చే దృశ్యం ౩ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారంతా. అయితే దాని కంటే ముందే జీతూ జోసెఫ్ ఒక డార్క్ రివెంజ్ డ్రామాతో ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అదే వలతు వషత్తే కల్లన్ (Valathu Vashathe Kallan).
ఏప్రిల్ 15 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా థియేటర్లోకి వచ్చి వెళ్ళిన ఈ సినిమా డిజిటల్ లోకి ఎంట్రీ ఇవ్వగానే మాత్రం మూవీ లవర్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. సినీ లవర్స్ అందునా థ్రిల్లర్ ప్రేమికులకి ఇదొక ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ రివెంజ్ డ్రామా జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా 2026, ఏప్రిల్ 15 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.ఇక ఈ సినిమా ఒరిజినల్ అయిన మలయాళoతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని డబ్బింగ్ వెర్షన్లు కూడా అదే రోజున అందుబాటులోకి రావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
also read:ఆలియా ఇంట్లో పెళ్లి బాజాలు.. నిశ్చితార్థం చేసుకున్న అక్క షాహీన్ భట్! వరుడు ఎవరంటే?
కథ విషయానికి వస్తే
శ్యామ్యూల్ జోసెఫ్ ఒక మాజీ ఎథికల్ హ్యాకర్. తన గతాన్ని వదిలేసి తన కూతురు, భార్యతో కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటాడు శ్యామ్యూల్. అయితే అనుకోకుండా అతని జీవితంలోకి ఒక విషాదం తుపానులా వచ్చి చేరుతుంది. ఒక పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి కొడుకు చేసిన అరాచకాన్ని ప్రశ్నించినందుకు శ్యామ్యూల్ కూతురు క్రూరంగా హత్య చేయబడుతుంది.ఈ క్రమంలోనే వ్యవస్థలో ఉన్న లొసుగులు, పోలీసుల అవినీతి కారణంగా నిందితులకు శిక్ష పడకపోగా, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో బిజూ మేనన్ పోషించిన అవినీతి పోలీస్ ఆఫీసర్ ఆంటోనీ పాత్ర వ్యవస్థలోని డార్క్ షేడ్స్ ఎలా ఉంటాయో కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది.తన కళ్ల ముందే కూతురు ప్రాణాలు కోల్పోవడం, చట్టం నిందితులకు కొమ్ముకాయడం చూసిన శ్యామ్యూల్ చివరకు తనదైన శైలిలో రివెంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. అలా తనకు తెల్సిన హ్యాకింగ్ టెక్నిక్స్ ని ఉపయోగించి ఎక్కడా ప్రూప్స్ లేకుండా శత్రువులను ఎలా చంపాడు అన్నది ఈ సినిమా కథ.
ఎమోషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన జీతూ
అయితే సస్పెన్స్ థ్రిల్లర్స్ కి కేరాఫ్ అయిన జీతూ జోసెఫ్ ఈ సినిమాలో ఎమోషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం గమనార్హం. సాధారణంగా ఆయన సినిమాల్లో ఒక ఇన్వెస్టిగేషన్ స్టైల్ కనిపిస్తుంది. కాని ఈ సినిమాలో ఒక తండ్రి పడే ఆవేదనను మరియు సాంకేతికతను ఉపయోగించి చేసే ప్రతీకారాన్ని చాలా ‘రా’ (Raw) అండ్ రియలిస్ట్ గా చూపించారు.ఇక శ్యామ్యూల్ జోసెఫ్ పాత్రలో జోజూ జార్జ్ తన కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని చెప్పకతప్పదు.పాలిటిక్స్ వల్ల కామన్ పీపుల్ ఎలా బలి అవుతున్నారు, సోషల్ మీడియా మరియు టెక్నాలజీ ఒక ఆయుధంగా ఎలా మారుతుంది అనే పాయింట్స్ ని చక్కగా బ్యాలెన్స్ చేసుకొచ్చాడు జీతూ జోసెఫ్.మరి ‘దృశ్యం’ శైలిలో సాగే మైండ్ గేమ్స్ ఇష్టపడే వారైతే మాత్రం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను అస్సల్ మిస్ కాకండే!
also read:‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ గుడ్ బాయ్ అనిపించుకున్నాడా ? ఫుల్ రివ్యూ