E-Paper
Advertisement

Dawood Death: దావూద్ బతికే ఉన్నాడా? అతడికి నిజంగానే స్లో పాయిజన్ ఇచ్చారా?

Dawood Death: దావూద్ బతికే ఉన్నాడా? అతడికి నిజంగానే స్లో పాయిజన్ ఇచ్చారా?
Advertisement

మీరు ‘దురంధర్ 2’ మూవీ చూశారా? చూడకపోతే.. ముందుగా దావుద్ గురించి తెలుసుకోండి. చూసి ఉంటే.. అసలు దావుద్ బతికి ఉన్నాడా లేదా? అతడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసుకోండి. ఇక అసలు కథలోకి వెళ్తే..

దావూద్ ఇబ్రహిం.. ఈ పేరు వింటే చాలు ముంబయి నగరం గజగజా వణికిపోయేది. బాలీవుడ్ తారల నుంచి వ్యాపార దిగ్గజాల వరకు.. ప్రతి ఒక్కరూ దావుద్ బాధితులే. దావుద్ ఏకంగా డి-కంపెనీ పేరుతో నేరాలను ఆర్గనైజ్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌‌గా లా అండ్ ఆర్డర్‌ను అల్లకల్లోలం చేసిన దావుద్ ఆచూకీ కోసం పోలీసులు, నిఘా వర్గాలు చేయని ప్రయత్నం లేదు. అయితే, దావుద్ ఇండియాలో లేడని.. పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడని సమాచారం. కానీ, పాక్ మాత్రం అతడు తమ వద్ద లేడని వాదిస్తోంది. తాజాగా రిలీజైన ‘దురంధర్ 2’ సినిమాలో ఇండియాలో జరుగుతున్న తీవ్రవాద చర్యలకు మాస్టర్ మైండ్ దావుద్ ఇబ్రహిం అన్నట్లుగా చూపించారు. గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన స్లోపాయిజన్ వల్ల అతడి ఆరోగ్యం క్షీణించి.. చావుబతుకులతో పోరాడుతున్నట్లు సినిమాలో ఉంది. అయితే అది సినిమా.. అందులో చూపించేవన్నీ నిజమేనని నమ్మలేం. ఎందుకంటే.. దావుద్ ఎక్కడ ఉన్నాడనేది ఇప్పటికీ మిస్టరీనే. అయితే.. దావుద్ పాక్‌లోనే ఉన్నాడని చెప్పేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవి తెలియాలంటే.. ముందుగా మీరు దావుద్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

బడా డాన్ to బడే సాబ్?

Advertisement

దావుద్ ఇబ్రహిం ఇండియాలో చేయని నేరం లేదు. అతడొక గ్యాంగ్ స్టర్ మాత్రమే కాదు.. డ్రగ్ లార్డ్, ఒక భయానక తీవ్రవాది. గత 30 ఏళ్లుగా ఈ దేశ ద్రోహి.. నిఘా వర్గాల కళ్లుగప్పి రహస్య జీవితం సాగిస్తున్నాడు. దావుద్ ఇబ్రహిం కస్కర్ మహారాష్ట్రలోని రత్నగిరిలో 1955లో డిసెంబర్ 26న జన్మించాడు. అతడు బతికి ఉంటే ఇప్పటికి సుమారు 71 ఏళ్లు. దావుద్ తండ్రి ముంబయిలో హెడ్ కానిస్టేబుల్. డోంగ్రీ అనే ముస్లిం ఏరియాలో నివసించేవాడు. దావుద్ చదువు అబ్బలేదు. టీనేజ్ వయస్సులోనే నేరాలు, మోసాలతో సంపాదించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ముంబయి అండర్ వరల్డ్‌లో జాయిన్ అయ్యాడు. చీకటి ప్రపంచంలో చిల్లర నేరాలు బోరు కొట్టి.. హాజీ మస్తాన్ అనే డాన్‌తో చేతులు కలిపాడు. ఆ తర్వాత తన సొంత నేర సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు.

ఒక దశాబ్దంలోనే డాన్ స్థాయికి..

1970 నుంచి 1980 మధ్య కాలంలో దావుద్ తన బలాన్ని పెంచుకున్నాడు. డి-కంపెనీ కింద అతడి అనుచరులు ఎన్నో అక్రమ వ్యాపారాలు చేసేవారు. బంగారం స్మగ్లింగ్ నుంచి డ్రగ్స్, కాంట్రక్ట్ హత్యలు, ఫేక్ మనీ, ఫిల్మ్ ఫైరసీ, బలవంతంగా డబ్బులు వసూళ్లు.. ఇలా ఒకటేమిటీ వారు చేయని నేరం అంటూ ఏదీ లేదు. దావుద్ ఎంతో క్రూరంగా ఉండేవాడు. ముంబయికి ఒక్కడే డాన్ ఉండాలనే పట్టుదలతో ఇతర గ్యాంగ్ స్టర్‌లను దారుణంగా హత్యలు చేయించాడు.

బాబ్రీకి ప్రతీకారంగా బాంబు దాడులు

Advertisement

అది 1993 సంవత్సరం, మార్చి 12.. ఇండియా కన్నీరు పెట్టుకున్న రోజు. ముంబయి రోడ్లన్నీ రక్తంతో ఎరుపెక్కిన రోజు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 బాంబు బ్లాస్టులతో ఆ రోజు ముంబయి నగరం ఉలిక్కిపడింది. ఈ దాడుల్లో సుమారు 250 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. 1992 బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారంగా దావుద్ ఈ బాంబు దాడులకు కుట్ర పన్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ విధ్వంసం తర్వాత దావుద్ ఇండియా నుంచి పారిపోయాడు. ముందుగా దుబాయ్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఇండియా అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికా సైతం గ్లోబల్ టెర్రరిస్ట్‌ల జాబితాలో చేర్చారు. అల్ ఖైదా, లష్కర్-ఇ-తాయిబా గ్రూపులో దావుద్‌కు లింకులు ఉన్నట్లు నిర్ధరించింది.

పాక్‌లో ఎక్కడ ఉన్నాడు?

ఇండియా నుంచి పారిపోయిన తర్వాత దావుద్ పాకిస్తాన్‌లోని కరాచీలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ముఖ్యంగా పాకిస్తాన్‌లో అత్యంత భద్రత కలిగిన పెద్ద పెద్ద బంగ్లాల్లో దావుద్ ఉండేవాడని తెలిసింది. ముఖ్యంగా క్లిఫ్టన్ (Clifton) లేదా డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ (DHA)కు చెందిన బంగ్లాలో ఉన్నట్లు సమాచారం. (‘దురంధర్ 2’ మూవీలో కూడా ఆ బంగ్లాను చూపించారు). అయితే, పాక్ మాత్రం అసలు దావుద్ తమ దగ్గర లేడనే బుకాయించేది. కానీ, కొన్ని రిపోర్టులు మాత్రం దావుద్ కరాచీలోనే వేర్వేరు పేర్లు, నకిలీ పాస్ పోర్టులతో తిరుగుతున్నాడని సమాచారం.

ఉన్నాడా? పోయాడా?

దావుద్ ఇప్పుడు బతికి ఉన్నాడా? చనిపోయాడా అనేది తెలియరాలేదు. దావుద్‌కు డయాబెటిస్ ఉందని, గ్యాంగ్రీన్ అనే వ్యాధికి గురై చనిపోయాడని అంటారు. కొందరైతే.. అతడికి గుర్తుతెలియని వ్యక్తి ఎవరో విషమిచ్చారని, కరాచీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడని తెలుపుతుంటారు. అయితే, ఇవేవీ నిర్ధరణ కాలేదు. ఇప్పటికీ అతడు బతికే ఉన్నాడని, అనారోగ్యంతో ఉన్నాడని మరికొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల విడుదలైన ‘దురంధర్ 2’ మూవీలో దావుద్ బతికే ఉన్నాడని, పాక్‌లో బడే సాబ్‌గా చెలామణి అవుతూ.. ఇండియాలో జరుగుతోన్న తీవ్రవాద కార్యకలాపాలకు మాస్టర్ మైండ్‌గా వ్యవహరిస్తున్నాడు అన్నట్లుగా అతడి పాత్రను చూపించారు.

దావుద్‌కు పాయిజన్ ఇచ్చింది నిజమేనా?

ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ వర్గాలు దావుద్ ఆచూకీ గురించి ఎలాంటి వివరాలను బయటపెట్టలేదు. ఒక వేళ అతడి గురించి తెలిసినా.. పూర్తి ఆధారాలు సేకరించి యాక్షన్‌లోకి దిగుతారు. ఇక పాయిజన్ విషయానికి వస్తే.. దావుద్‌కు 2023, డిసెంబర్‌ నెలలో గుర్తుతెలియని వ్యక్తి స్లో పాయిజన్‌ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద చర్చే జరిగింది.

దావుద్‌కు మనుషుల్లో ఒకరు ఈ పని చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ విషం వల్ల దావుద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, దీంతో వెంటనే అతడిని కరాచీ ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. అప్పుడే దావుద్ చనిపోయాడనే సమాచారం దావనంలా వ్యాపించింది. అయితే, ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం దావుద్‌కు ఎవరూ పాయిజన్ ఇవ్వలేదు.. అతడు చనిపోలేదు కూడా అని వెల్లడించాయి. దావుద్‌కు కుడి భుజమైన చోటా షకీల్ కూడా ఆ వార్తలను ఖండించాడు. దావుద్ వెయ్యి శాతం ఫిట్‌గా ఉన్నాడని పేర్కొన్నాడు.

Also Read: సముద్రం అట్టడుగునా నల్ల రంగు గుడ్లు.. ఏంటా అని పరిశీలిస్తే..

అయితే, పాకిస్తానే కావాలని దావుద్ మరణ వార్తలను ప్రచారం చేసిందనే సందేహాలు కూడా ఉన్నాయి. అలా చేయడం వల్ల ఇండియానకు గందరగోళానికి గురిచేయొచ్చనేది పాక్ ప్లాన్ కూడా కావచ్చు. ఏది ఏమైనా.. దావుద్ లాంటి దేశద్రోహి బతికి ఉండకూడదనే కోరుకుందాం. ఒక వేళ బతికి ఉన్నట్లు సమాచారం దొరికితే.. వాడి ఇంట్లోకి వెళ్లి మరీ లేపేసే సత్తా.. మన సైన్యానికి ఉంది.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×