E-Paper
Advertisement

ఫోన్ ఛార్జింగ్ సరిగ్గా అవట్లేదా? కొత్త ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ ట్రై చేయండి!

ఫోన్ ఛార్జింగ్ సరిగ్గా అవట్లేదా? కొత్త ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ ట్రై చేయండి!
Advertisement

Smartphone charging problem: ప్రస్తుత డిజిటల్ కాలంలో స్మార్ట్‌ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతి చిన్న పనికి ఫోన్ మీదనే ఆధారపడుతున్న.. తరుణంలో.. ఫోన్ ఛార్జింగ్ సరిగ్గా అవక పోతే కలిగే ఇబ్బంది అంతాఇంతా కాదు. రాత్రంతా ఛార్జింగ్‌లో ..పెట్టినా బ్యాటరీ 100 శాతం నిండక పోవడం,లేదా చాలా నెమ్మదిగా ఛార్జ్ కావడం వంటి సమస్యలు కొన్ని సార్లు కనిపిస్తుంటాయి. ఫోన్ పాతబడి పోయిందని.. భావించి చాలా మంది వెంటనే.. కొత్త ఫోన్ కొనేందుకు మార్కెట్‌లోకి పరుగులు తీస్తుంటారు. కానీ..కొద్ది పాటి అవగాహన ఉంటే.. ఇంట్లోనే ఈ సమస్యను రెక్టిఫై చేసుకోవచ్చు.టెక్ నిపుణుల సలహాల ప్రకారం.. బ్యాటరీ సమస్యలకు గల కారణాలు, పరిష్కారాలు ఇప్పుడు చూద్దాం.

1. ఛార్జింగ్ పోర్ట్‌లో ధూళి :

మనం ఫోన్‌ను పాకెట్‌లో.. లేదా బ్యాగ్‌లో పెట్టుకోవడం వల్ల దాని ఛార్జింగ్ పోర్ట్‌లో చిన్న చిన్న దుమ్ము ధూళి కణాలు, చెత్త పేరుకు పోతుంటాయి. దీని వల్ల ఛార్జింగ్ కేబుల్ పిన్ సరిగ్గా కనెక్ట్ కాదు. ఫలితంగా కరెంట్ సక్రమంగా పాస్ కాక బ్యాటరీ ఫుల్ కాదు. టూత్ పిన్ లేదా మెత్తటి బ్రష్‌తో ఛార్జింగ్.. పోర్ట్‌ను చాలా జాగ్రత్తగా క్లీన్ చేయడం ద్వారా ఈ సమస్య ఈజీగా తొలగిపోతుంది.

2. అడాప్టర్ లేదా కేబుల్ వాడటం:

Advertisement

అన్ని ఛార్జర్లు ఒకేలా పని చేయవు. మీరు ఒరిజినల్ ఛార్జర్ కాకుండా.. లోకల్ కేబుల్ లేదా అడాప్టర్ ఉపయోగిస్తుంటే.. బ్యాటరీ ఛార్జింగ్ నెమ్మదించడమే కాకుండా.. పూర్తిగా నిండదు. అలాగే.. మీ ఛార్జింగ్ కేబుల్ లోపల వైర్లు కట్ అయి ఉండొచ్చు. మార్కెట్లో బ్రాండెడ్ ఫాస్ట్ ఛార్జర్స్ ధరలు సుమారు రూ. 800 నుంచి రూ. 2,500 వరకు అందుబాటులో ఉంటాయి. అందుకే ఒరిజినల్ ఛార్జర్‌ వాడటం ఎప్పుడూ మంచిది.

3. ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ సెట్టింగ్స్:

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో (ఆండ్రాయిడ్ , ఐఫోన్) బ్యాటరీ ఆయుష్షును కాపాడటానికి.. ‘ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్’ లేదా ‘ప్రొటెక్టివ్ ఛార్జింగ్’ అనే ఫీచర్లు ఉంటున్నాయి. ఈ ఫీచర్ ఆన్‌లో ఉంటే..రాత్రి సమయంలో బ్యాటరీ 80 శాతానికి చేరుకున్న తర్వాత ఛార్జింగ్ ఆటోమేటిక్‌గా నెమ్మదిస్తుంది లేదా తాత్కాలికంగా ఆగి పోతుంది. యూజర్ లేచే సమయానికి మాత్రమే.. అది 100 శాతం నిండుతుంది. ఒక వేళ మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్ కారణంగా అలా జరుగుతుంటే అది లోపం కాదు.. బ్యాటరీ సేఫ్టీ ఫీచర్ మాత్రమే.దీన్ని సెట్టింగ్స్‌లో మార్చుకోవచ్చు.

Advertisement

Also Read: స్మార్ట్ టీవీ మైక్రోఫోన్ ఆన్‌లో ఉందా? అయితే ఈ సెట్టింగ్ వెంటనే మార్చండి!

4. బ్యాటరీ కాలిబ్రేషన్:

కొన్ని సార్లు బ్యాటరీ లోపల టెక్నికల్ సమస్యలు లేకపోయినా.. సాఫ్ట్‌వేర్ బగ్స్ కారణంగా 100 శాతం ఛార్జింగ్ చూపించదు. ఫోన్‌ను పూర్తిగా డిశ్చార్జ్ చేసి ఆ తర్వాత ఎలాంటి మధ్యలో డిస్‌ కనెక్ట్ చేయకుండా.. 100 శాతం వరకు నిరంతరం ఛార్జ్ చేయడం ద్వారా బ్యాటరీ కాలిబ్రేషన్ సెట్ అవుతుంది. అలాగే మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌ డేట్ చేయడం వల్ల కూడా ఇలాంటి చిన్న చిన్న బగ్స్ తొలగిపోతాయి.

కొత్త ఫోన్‌కి వేల రూపాయలు ఖర్చు పెట్టేముందు పైన ..పేర్కొన్న చిన్న చిన్న ట్రిక్స్ , సెట్టింగ్స్‌ని ఒకసారి చెక్ చేయడం చాలా ముఖ్యం. ఇలా మీ ఫోన్ ఛార్జింగ్ సమస్యను ఇలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు.

Related News

యాపిల్ ఐప్యాడ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఒప్పో కొత్త మినీ టాబ్లెట్.. ధర రూ.95,000!

మీ మెయిల్‌కి..ఎవరు లాగిన్ అవుతున్నారో చెక్ చేయండిలా!

సైజులో చిన్నదే.. హెల్త్ ఫీచర్లు మాత్రం బోలెడు, Oura Ring 5 భారత్‌లోకి వచ్చేసింది!

ChatGPTలో పర్సనల్ చాట్స్ లాకింగ్ ఫీచర్ వచ్చేసింది.. కానీ ఆ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు!

రూ.10 వేలకే కొత్త ఫ్లిప్ ఫోన్.. ఇందులో ఉన్న ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!

స్మార్ట్ టీవీ మైక్రోఫోన్ ఆన్‌లో ఉందా? అయితే ఈ సెట్టింగ్ వెంటనే మార్చండి!

శాంసంగ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 ఫోన్లకు అప్‌డేట్స్ ఎప్పటివరకంటే?

Big Stories

Advertisement
×