E-Paper
Advertisement

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!
Advertisement

Salman Khan: బాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల జాబితాలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా నిలిచి.. ఎప్పటికప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా కండల వీరుడిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సరే చాలా హుందాగా కనిపిస్తూ తన అందాలతో అమ్మాయిలను తన వైపు తిప్పుకునే సల్మాన్ ఖాన్.. సడన్గా ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులను ఆందోళనకు గురి చేశారు. ఆయనకు సంబంధించిన లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్..

ముఖ్యంగా ఎప్పుడూ కండలు తిరిగిన దేహంతో దృఢంగా కనిపించే సల్మాన్ ఖాన్ సడన్ గా అలా ఎలా అయిపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సల్మాన్ ఖాన్ లుక్ పై నెటిజన్స్ , అభిమానుల మధ్య విపరీతమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఈ లుక్ చూసిన కొంతమంది సహజంగా వయసు మీద పడడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు అని కామెంట్లు చేస్తుంటే.. మరి కొంత మంది సల్మాన్ ఖాన్ రాబోయే కొత్త ప్రాజెక్టు కోసం తీసుకున్న ప్రత్యేకమైన మేకోవర్ అయి ఉండొచ్చు అంటూ మరికొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మరికొంతమంది ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్ లేటెస్ట్ లుక్ పై కొత్త చర్చ..

Advertisement

మరోవైపు సల్మాన్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నట్లు.. ఆయన కుటుంబ సభ్యుల నుంచి లేదా అధికారిక పిఆర్ బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందుకే సినీ నిపుణులు మాత్రం పరిశ్రమలో నటులు తాము చేసే పాత్రలను డిమాండ్ మేరకు బరువు పెరగడం లేదా తగ్గడం , భిన్నమైన గెటప్లలో కనిపించడం సహజమే. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఊహాగానాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఎందుకోసమో తెలియదు కానీ సల్మాన్ ఖాన్ సడన్ లుక్ చూసి అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

also read:వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

సల్మాన్ ఖాన్ ప్రస్తుత సినిమాలు:

Advertisement

సల్మాన్ ఖాన్ నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాల విషయానికొస్తే.. ఒకటి యాక్షన్ వార్ డ్రామా ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్ ‘ అనే చిత్రంలో నటిస్తున్నారు. గాల్వాన్ ప్రాంతంలోని సంఘటనల ఆధారంగా అపూర్వ లిఖియా దర్శకత్వం వహించిన ఉత్కంఠ భరితమైన యుద్ధ నాటకం. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నయనతార సహనటిగా, దిల్ రాజు నిర్మిస్తున్న ఒక మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. అలాగే రాజ్ అండ్ డీకే ప్రాజెక్టుకి కూడా సల్మాన్ ఖాన్ సంతకం చేశారు.

Related News

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

Big Stories

Advertisement
×