E-Paper
Advertisement

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!
Advertisement

Pawan Kalyan:కేంద్ర ప్రభుత్వం 2024 ఏడాదికి గానూ తాజాగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు వివిధ భాగాలలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగులో ప్రత్యేకించి తొమ్మిది విభాగాలలో నేషనల్ అవార్డ్స్ లభించాయి. ఇకపోతే జాతీయ అవార్డులకు ఎంపికైన సెలబ్రిటీలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ప్రశంస పత్రాన్ని విడుదల చేయడం జరిగింది

నిహారికకు ప్రత్యేక అభినందనలు..

నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం చాలా సంతోషకరం. ముఖ్యంగా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయనీ గాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రముఖ నటులు శ్రీ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం సంతోషదాయకం. నాలుగవసారి ఆయన ఉత్తమ జాతీయ నటుడిగా నిలిచి యువ నటులకు స్ఫూర్తినిచ్చారు. శ్రీ మమ్ముట్టికి ఆయనతో పాటు ఈ పురస్కారానికి ఎంపికైన శ్రీ కార్తిక్ ఆర్యన్ కు, ఉత్తమ నటిగా నిలిచిన శ్రీమతి యామీ గౌతమ్ కు అభినందనలు.

జాతీయ అవార్డు గ్రహీతలకు డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు..

Advertisement

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పలు పురస్కారాలు లభించడం శుభ పరిణామం ఉత్తమ పాపులర్ చిత్రంగా కల్కి2898AD, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో కల్కి2898AD(నితిన్ జిహాని చౌదరి), ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు, ఉత్తమ బాలు నటుడిగా అరుణ్ దేవ్ పోతుల, ఉత్తమ స్క్రీన్ ప్లేయర్ రచయితగా శ్రీ సుకుమార్ (పుష్ప 2), ఉత్తమ సంభాషణల రచయిత గా శ్రీ వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో పుష్ప 2(దీపాలి నూర్, శీతల్ శర్మ) లకు నా అభినందనలు.

also read:వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

కమిటీ కుర్రోళ్ళు మూవీపై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంస..

Advertisement

నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారానికి ఎంపిక కావడం చాలా సంతోషాన్నిచ్చింది. నిర్మాతగా నిహారిక చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల మెప్పుతో పాటు అవార్డులు దక్షించుకుంది. చిత్ర నిర్మాణంలో నిహారికతో పాటు భాగమైన శ్రీమతి పద్మజ కొణిదెల , శ్రీమతి జయలక్ష్మి అడపాక , ఈ చిత్ర దర్శకుడు శ్రీ యదువంశీలకు నా అభినందనలు. ఈ చిత్రానికి మేకప్ ఆర్టిస్ట్ గా బాధ్యతలు చూపిన శ్రీ పి రవికుమార్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యారు. ఆయనకు నా అభినందనలు అంటూ తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ,సినీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా జాతీయ అవార్డు గ్రహీతలపై ప్రశంసలు కురిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×