BigTV English

Salman Khan: రాముడిగా సల్మాన్ ఖాన్.. 40 శాతం షూటింగ్ పూర్తి.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు!

Salman Khan: రాముడిగా సల్మాన్ ఖాన్.. 40 శాతం షూటింగ్ పూర్తి.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు!

Salman Khan: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే రామాయణం(Ramayanam) ఇతిహాసం ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి. అయితే త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రామాయణ(Ramayana) సినిమా పేరుతో మరొకచిత్రం రాబోతోంది డైరెక్టర్ నితేష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సాయి పల్లవి (Sai Pallavi)సీతారాముడి పాత్రలో నటించబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకొని మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా కంటే ముందుగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం సినిమా తెరకెక్కిందని దాదాపు 40% షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి అంటూ తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది.


సీతగా సోనాలి బింద్రే ..

ఈ రామాయణం సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) రాముడి పాత్రలో నటించగా సోనాలి బింద్రే(Sonali bendre) సీత పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది అనే విషయానికి వస్తే… సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ఈ సినిమాని 90 లలో షూటింగ్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇందులో సల్మాన్ ఖాన్ సోనాలి బింద్రే సీతారాముడుగా కనిపించగా పూజ భట్ కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించిన తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సోహైల్ పూజ భట్ మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది.


పూజ భట్ ప్రేమ వ్యవహారం…

ఇలా వీరిద్దరి ప్రేమ గురించి సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ కు తెలియడంతో పూజతో తన రిలేషన్ మానుకోవాలని సూచించారట. అదే సమయంలో పూజ భట్ ను ఈ సినిమా నుంచి తప్పించాలని సల్మాన్ ఖాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరని నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ నిలిపి వేశారని తెలుస్తోంది. కేవలం పూజ కారణంగానే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని లేకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం సినిమా 90 లలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేదని తెలుస్తోంది. ఇక తాజాగా రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

రెండు భాగాలుగా రామాయణ…

ఈ సినిమా ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సినిమా కూడా రాని విధంగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రాబోతుంది. సుమారు ఈ సినిమా కోసం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో రావణాసురుడు పాత్రలో కన్నడ స్టార్ యష్ నటించడమే కాకుండా ఈ సినిమా నిర్మాణంలో ఈయన కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఇక రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మొదటి భాగం 2026 దీపావళిని పురస్కరించుకొని విడుదల కాగా రెండో భాగం 2027 దీపావళి పండుగ సందర్భంగా రాబోతుంది. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఒక గ్లింపు వీడియో సినిమా పట్ల ఎన్నో అంచనాలను పెంచేసింది.

Also Read: Uorfi Javed: వికటించిన కాస్మెటిక్ సర్జరీ… గుర్తుపట్టలేని స్థితిలో ఉర్ఫీ జావేద్!

Related News

Upasana: క్లీంకారా డైలీ ఫుడ్ అదే.. లేకుంటే అంతే సంగతి అంటూ!

Coolie Movie : రిలీజ్ కు ముందే ‘కూలీ ‘ హిట్.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే..?

Comedian : చీపురుతో కొట్టిన భార్య… అవమానంతో సూసైడ్ చేసుకున్న స్టార్ కమెడియన్

Chinmayi Sripada : రిపోర్టర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిన్మయి.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

Nagarjuna:టబు, రమ్యకృష్ణ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్.. నాగ్‌ను ఇరకాటంలో పెట్టిన జగపతిబాబు

NTR: నా తొలి అభిమాని అతడే.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Big Stories

×