HHVM Pre Relese Event : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా ఈరోజు నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ హాజరు కావడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు సాయంత్రం జరగనుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఉదయం పవన్ కళ్యాణ్ దర్శనం అయిపోయిన తర్వాత మరోసారి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కళ్యాణ్ దర్శనం ఉండబోతుంది. అయితే ఈ ఈవెంట్ కి ఎవరు గెస్ట్ లుగా వస్తారు అని చాలామందికి క్యూరియాసిటీ మొదలైంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత మొదట జరుగుతున్న సినిమా ఫంక్షన్ ఇది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ దర్శకుడు
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకుడు హరీష్ శంకర్ కూడా హాజరవుతున్నారు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద వీరాభిమాని అని మాటల్లో చెప్పాల్సిన పనిలేదు. పలు సందర్భాల్లో కట్టె కాలే వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమా ఆడియో లాంచ్ లో పవన్ కళ్యాణ్ అంటే హరీష్ శంకర్ కి ఎంత ఇష్టం అని మాటల్లో చెప్పాడు. అలానే సినిమాతో కూడా ప్రూవ్ చేశాడు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడా డైలాగ్స్ రాసి ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించాడు. నేడు జరగబోతున్న హరిహర వీరమల్లు ఈవెంట్ కి కూడా హరీష్ శంకర్ హాజరవుతున్నాడు అంటే చాలామందికి క్యూరియాసిటీ మొదలైంది. ఒక పవర్ఫుల్ స్పీచ్ లోడింగ్ లో ఉంది అని అందరికీ అర్థమవుతుంది.
షూటింగ్ దశలో ఉస్తాద్ భగత్ సింగ్
ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ కారణం వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన గబ్బర్ సింగ్. ఈ సినిమా నుంచి విడుదలైన రెండు వీడియోలు కూడా విపరీతమైన పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడా డైలాగులు రాశారు అని అర్థమవుతుంది. అలానే పవన్ కళ్యాణ్ ను దైవాంశ సంభూతుడిగా ఈ సినిమా టైటిల్స్ లోనే ప్రజెంట్ చేశాడు హరీష్. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించబోతున్నారు అని లీక్ అయిన వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సినిమా కూడా త్వరలో రిలీజ్ కావాల్సి ఉంది.
Also Read : Simbu : షూటింగ్ సెట్స్‌లో ప్రమాదంలో చనిపోయిన స్టంట్ మాస్టర్… హీరో శింబు భారీ విరాళం