Uorfi Javed: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగడం కోసం తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఇలా అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున సర్జరీలు(Surgery) చేయించుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఉండే దాదాపు చాలామంది హీరోయిన్స్ అలాగే హీరోలు కూడా ఇలా సర్జరీలు చేయించుకుని తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు ఈ సర్జరీలు వికటించడం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి.
కాస్మెటిక్ సర్జరీ..
తాజాగా బాలీవుడ్ నటి బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ (Uorfi Javed) సైతం ఇలా కాస్మెటిక్ సర్జరీ (Cosmotic Surgery)చేయించుకోవడంతో అది కాస్త వికటించిందని దీంతో ఆమె గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయారని తెలుస్తుంది. తన ఫేస్ మొత్తం ఉబ్బిపోవడమే కాకుండా పెదాలు మొత్తం వాచిపోవడంతో చూడటానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ కు సంబంధించిన ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు ఇప్పటివి కాదని గత కొన్ని సంవత్సరాల క్రితం అంటూ ఈమె తాజాగా ఈ వీడియోని షేర్ చేశారు.
లిప్ పిల్లర్స్..
దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం ఈమె లిప్ పిల్లర్స్(Lip Pillers) కోసం ట్రై చేయడంతో ఊహించని సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. తనకు 18 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఈ ప్రయోగం చేశానని తెలిపారు. అయితే ఇది కాస్త వికటించడంతో ఒక్కసారిగా నా పెదవులు మొహం మొత్తం ఉబ్బిపోయిందని ఈమె తెలిపారు. ఇంత కాలానికి అవి సెట్ అయ్యాయని తెలియజేశారు. లిప్ పిల్లర్ల విషయంలో తాను కృత్రిమ పద్ధతిని ఆశ్రయించి తప్పు చేశానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ సమయంలో నన్ను నేను చూసుకుని ఎంతగానో నవ్వుకున్నానని, చివరికి నా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందని తెలిపారు.
?igsh=d3dpZ3hxMTZ3aGg2
ఇలా అప్పుడు పిల్లర్ల కోసం ట్రై చేస్తే ఇప్పటికి వాటిని కరిగించుకున్నానని తెలిపారు. అయితే ఎవరూ కూడా ఇలాంటి తప్పు చేయొద్దని మీరు ఒకవేళ ఇలాంటివి ప్రయత్నం చేస్తే కచ్చితంగా మంచి అనుభవం కలిగిన డాక్టర్ల వద్దకు మాత్రమే వెళ్ళండి అంటూ అందరికీ సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఉర్ఫీ విషయానికి వస్తే.. హిందీ బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే సందడి చేసిన ఈమె ప్రస్తుతం పలు కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు తాజాగా ఈమె ఓటీటీ షో ట్రెయిటర్స్ కార్యక్రమంలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో ఈమె తన వస్త్రధారణ ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
Also Read: Natti Kumar: ఫిష్ వెంకట్ మరణిస్తే ఎందుకు వెళ్లాలి.. నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు!