E-Paper
Advertisement

బోల్డ్ ఫోటోషూట్ తో రచ్చ చేస్తున్న అక్కినేని కోడలు.. టార్గెట్ చేసిన సమంత ఫ్యాన్స్!

బోల్డ్ ఫోటోషూట్ తో రచ్చ చేస్తున్న అక్కినేని కోడలు.. టార్గెట్ చేసిన సమంత ఫ్యాన్స్!
Advertisement

Sobhita Dhulipala: అక్కినేని ఇంటి కోడలు శోభిత ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె నటుడు నాగచైతన్యతో కలిసి ఏడు అడుగులు నడిచారు. ఇలా నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత శోభిత సినిమాలకు పెద్దగా కమిట్ అవ్వకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు మాత్రం పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యాయి.

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ పై శోభిత..

శోభిత ఇటీవల హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా (Hollywood Reporter India)మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటోషూట్ నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఇక ఈ ఫోటోలలో శోభిత ఓవర్ ఎక్స్పోజ్ ఇవ్వడంతో ఇవి కాస్త వైరల్ అవ్వటమే కాకుండా సమంత ఫాన్స్(Samantha Fans) కు టార్గెట్ గా మారారు. శోభిత చేసిన ఈ బోల్డ్ ఫోటోషూట్ పై సమంత అభిమానులు స్పందిస్తూ.. గతంలో సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం ఆమె ఎక్స్ పోస్ చేయడమే అంటూ అక్కినేని అభిమానులు విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.

సమంత ఎక్సపోజింగ్ చేశారంటూ..

Advertisement

ఈ విషయాన్ని సమంత అభిమానులు ఇప్పుడు ప్రస్తావిస్తూ..సమంత అక్కినేని ఇంటి కోడలు అనే సంస్కారం లేకుండా ఐటెం సాంగ్ లు, దుపట్టా లేకుండా ఎక్సపోజింగ్ లు చేసింది కాబట్టి విడాకులు ఇచ్చి, శోభితను పెళ్లి చేసుకున్నారంటూ కొంతమంది పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అలా సమంత గురించి విమర్శలు చేసిన వారందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటూ సామ్ అభిమానులు అక్కినేని ఫాన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు పలువురు అక్కినేని అభిమానులు సైతం శోభిత వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు ఇవన్నీ అవసరమా?

శోభిత అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటే బాగుంటుందని, ఇలా బోల్డ్ ఫోటోలను షేర్ చేయడం అక్కినేని కుటుంబ పరువును తీయడమే అంటూ మరికొందరు శోభిత తీరును విమర్శిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం శోభిత చేసిన దాంట్లో తప్పేముంది అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా శోభిత చేసిన ఈ బోల్డ్ ఫోటోషూట్ సోషల్ మీడియా వేదికగా అక్కినేని ఫ్యాన్స్ వర్సెస్ సమంత ఫ్యాన్స్ అనే విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకుంటున్నారు. ఇక శోభిత ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ (Pa. Ranjith) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టువమ్’ (Vettuvam) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: మొదటసారి రష్మికతో కలసి పుట్టపర్తి వచ్చిన విజయ్ దేవరకొండ!

Related News

భార్య అంటే ఉచితంగా వచ్చే పనిమనిషా?- అనుపమ కామెంట్స్ వైరల్!

తన జీవిత గాథ అలానే ముగియాలి..తన బయోపిక్ మూవీ పై సల్మాన్ ఖాన్ కామెంట్స్!

సాయి దుర్గ తేజ్ బర్తడే స్పెషల్.. అమ్మవారి మొక్క నాటిన నాగబాబు!

మొదటసారి రష్మికతో కలసి పుట్టపర్తి వచ్చిన విజయ్ దేవరకొండ!

‘ భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ బయోపిక్ పై రజినీకాంత్ కామెంట్స్!

నానా పటేకర్ చనిపోలేదా.. హాట్ బాంబు పేల్చిన నటి!

ఆ ఒక్క క్షణమే పునీత్ ప్రాణం తీసిందా..ఇన్నేళ్ళకి బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×