E-Paper
Advertisement

జగన్‌తో పొత్తు ఎలా? అంటూ మాధవ్ ప్రశ్న, ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య

జగన్‌తో పొత్తు ఎలా? అంటూ మాధవ్ ప్రశ్న, ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య
Advertisement

Madhav Vs Jagan: వైసీపీ అధినేత జగన్ ఫ్యూచర్ ప్లాన్ మెల్లగా బయటపడుతోందా? సీజేపీతో ఏపీలో నిరసనలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అందుకే ఆ పార్టీకి మద్దతుగా సమయం, సందర్భం బట్టి ఎక్స్‌లో రియాక్ట్ అవుతున్నారా? జగన్ వ్యవహారశైలిని బీజేపీ గమనిస్తోందా? ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రిపై ఏపీ బీజేపీ చీఫ్ మండిపడ్డారా? అవుననే అంటున్నాయి రాజకీయ పార్టీలు.

జగన్‌ వైఖరిని ప్రశ్నించిన బీజేపీ చీఫ్ మాధవ్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ నినాదాలు చేసే CJP.. అవినీతి ఆరోపణలకు సంబంధించి కేసులను ఎదుర్కొంటున్న జగన్‌తో చేతులు కలపడం వెనుక అసలు అజెండా స్పష్టమవుతోందన్నా రు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. జగన్‌పై ఉన్న ఈడీ, సీబీఐ కేసులను ప్రస్తావించారు.

రాజకీయ లబ్ది కోసం జగన్ ప్రయత్నాలు-బీజేపీ

Advertisement

వైసీపీ పాలనలో రాష్ట్రంలో దేవాలయాల విధ్వంసం , రథాలు దగ్ధం , విగ్రహాల శిరచ్చేధన, దేవాలయాల ఆస్తుల ఆక్రమణ, మత మార్పిడులను ప్రోత్సహించడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన జగన్, ఇవాళ రాజకీయ లబ్ది కోసం దేశంలోని విచ్చిన్నకర శక్తులతో చేతులు కలిపి తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారని ఆరోపించారు. YSRCP పాలనలో ప్రతిపక్షాల హక్కులు, రాజకీయ స్వేచ్ఛకు ఎదురైన సవాళ్లను, ప్రజలు పడిన ఇబ్బందులను ప్రజలు మర్చిపోలేదన్నారు.

శాంతియుత నిరసన ప్రజాస్వామ్య హక్కని, హింస-రాళ్ల దాడులు, పోలీసులపై దాడులు, మహిళల పట్ల అనుచిత ప్రవర్తన, భద్రతా సిబ్బందిపై దాడులకు ప్రజాస్వామ్యంలో చోటు లేదన్నారు. చట్టాన్ని అమలు చేసే పోలీసుల చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం మాజీ సీఎంకు బాధ్యత కాదన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అస్థిరత, విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులతో కలిసి జగన్ సాగిస్తున్న రాజకీయ ప్రయత్నాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement

ALSO READ: వివేకా హత్య కేసు సాయంత్రానికి కొత్త మలుపు, అవినాష్ అరెస్టుకు సంకేతాలు!

తగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తమ తీర్పు వెల్లడిస్తారని స్పష్టం చేశారు. సీజేపీ నేతల అరెస్టుపై జగన్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులు దేన్ని పరిష్కరించవని, పరిస్థితిని మరింత జఠిలం చేస్తాయని తేల్చిచెప్పారు. మొత్తానికి రానున్న రోజుల్లో సీజేపీ ద్వారా ఏపీలో నిరసనలకు వైసీపీ అధినేత జగన్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు కొందరు నేతలు.

 

 

 

 

 

 

Related News

వివేకా హత్య కేసు సాయంత్రానికి కొత్త మలుపు, అవినాష్ అరెస్టుకు సంకేతాలు! ఇవాళ విచారణకు

ఏపీలో స్థానిక ఎన్నికల ఫైట్.. పత్తా లేని వైసీపీ, జోష్ లేక డీలా పడుతున్న కేడర్

లోకల్ బాడీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి పలుకులు, రూలింగ్ పార్టీకి అనుకూలం, పవన్‌పై కూడా

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

Big Stories

Advertisement
×