E-Paper
Advertisement

మొదటసారి రష్మికతో కలసి పుట్టపర్తి వచ్చిన విజయ్ దేవరకొండ!

మొదటసారి రష్మికతో కలసి పుట్టపర్తి వచ్చిన విజయ్ దేవరకొండ!
Advertisement

Vijay Devarakonda -Rashmika: సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తన భార్య, సినీనటి రష్మిక మందన్నతో కలిసి మొదటిసారి పుట్టపర్తికి వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండకు పుట్టపర్తి(Puttaparthi)తో ప్రత్యేక అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో విజయ్ రష్మికతో (Rashmika)పాటు ఆయన తల్లి కూడా ప్రశాంతి నిలయం చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రశాంతి నిలయంలో విజయ రష్మిక ప్రత్యేక పూజలు..

విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా రణబాలి సినిమా(Ranabaali Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో వీరిద్దరు జంటగా పుట్టపర్తి వెళ్లి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇక రణబాలి సినిమాలో కూడా పుట్టపర్తికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయని ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. పుట్టపర్తితో విజయ్ దేవరకొండకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్న నేపథ్యంలోనే రణబాలి సినిమాలో పుట్టపర్తికి సంబంధించిన సన్నివేశాలను కూడా పెట్టినట్టు తెలుస్తుంది.

సత్య సాయి ట్రస్టులోనే విద్యాభ్యాసం..

Advertisement

విజయ్ దేవరకొండ తన విద్యాభ్యాసం మొత్తం పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి ట్రస్టులోనే చదువుకున్నట్లు గతంలో పలు సందర్భాలలో తెలియచేశారు. ఇలా పుట్టపర్తితో తనకున్న అనుబంధం కారణంగా తరచూ ఈయన ప్రశాంతి నిలయం చేరుకొని బాబా సమాధిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక రణబాలి సినిమాలో పుట్టపర్తికి సంబంధించిన సన్నివేశాలను పెట్టడంతో భవిష్యత్తులో ఈయన సత్యసాయిబాబా బయోపిక్ (Sathya Saibaba Biopic)సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ కూడా ఇటీవల విజయ్ దేవరకొండకు ప్రశ్నలు ఎదురైన సంగతి తెలిసిందే.

సత్య సాయిబాబా బయోపిక్ చేయను..

ఈ నేపథ్యంలోనే సత్య సాయి బాబా బయోపిక్ సినిమా గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తనకు సాయిబాబా బయోపిక్ సినిమాలో నటించాలని ఉన్నప్పటికీ తాను చేయనని తెలిపారు. సత్య సాయిబాబా చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్ సినిమాలో చేయటానికి తాను అనర్హుడు అంటూ విజయ్ దేవరకొండ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఇక తాజాగా దసరా నవరాత్రులు పురాణబాలి ప్రమోషన్లలో భాగంగానే ఈ జంట పుట్టపర్తిని సందర్శించారు. ఇక రణబాలి సినిమా అక్టోబర్ 16వ తేదీ దసరా పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . పెళ్లి తర్వాత విజయ రష్మిక జంటగా నటించిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై వారి అంచనాలే ఉన్నాయి.

Advertisement

Also Read: తల్లి కాబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఘనంగా సీమంతపు వేడుక!

Related News

సాయి దుర్గ తేజ్ బర్తడే స్పెషల్.. అమ్మవారి మొక్క నాటిన నాగబాబు!

బోల్డ్ ఫోటోషూట్ తో రచ్చ చేస్తున్న అక్కినేని కోడలు.. టార్గెట్ చేసిన సమంత ఫ్యాన్స్!

‘ భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ బయోపిక్ పై రజినీకాంత్ కామెంట్స్!

నానా పటేకర్ చనిపోలేదా.. హాట్ బాంబు పేల్చిన నటి!

ఆ ఒక్క క్షణమే పునీత్ ప్రాణం తీసిందా..ఇన్నేళ్ళకి బయటపడ్డ నిజం!

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

Big Stories

Advertisement
×