E-Paper
Advertisement

Samantha -Raj Nidimoru: భర్త విషయంలో సమంత కీలక నిర్ణయం..అప్పుడు చైతూ..ఇప్పుడు రాజ్

Samantha -Raj Nidimoru: భర్త విషయంలో సమంత కీలక నిర్ణయం..అప్పుడు చైతూ..ఇప్పుడు రాజ్
Advertisement

Samantha -Raj Nidimoru: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ తో పాటు బిజినెస్ రంగంలో కూడా సమంత (Samantha)తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్న సమంత వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత సమంత ఎక్కడికి వెళ్లినా తన భర్తతో కలిసి సందడి చేస్తున్నారు. ఇక సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత తిరిగి రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సమంత నిడుమోరి..

ఇక ఈమె వివాహం జరిగి రెండు నెలలు అవుతుంది ఈ నేపథ్యంలోనే తన రెండో భర్త కోసం సమంత కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి భర్త కోసం సమంత తీసుకోబోతున్న ఆ నిర్ణయం ఏంటి అనే విషయానికి వస్తే… సమంత రెండో పెళ్లి తర్వాత తన పేరును మార్చుకోవాలనే నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం ఈమె తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సమంతగా తన పేరు ఉంది. ఇకపై సమంత నిడుమోరి(Samantha Nidimoru)గా తన పేరును మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సమంత ప్రస్తుతం హీరోయిన్గా నటిస్తున్న మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) సినిమా టైటిల్ కార్డ్స్ లో కూడా తన పేరు సమంత నిడుమోరిగా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

మా ఇంటి బంగారం..

Advertisement

గతంలో సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమయంలో కూడా ఇలాగే పెళ్లి తర్వాత తన భర్త ఇంటి పేరును తన పేరు పక్కన చేర్చుకొని సమంత అక్కినేనిగా చలామణి అయ్యారు. ఇక నాగచైతన్యతో విభేదాలు వచ్చిన నేపథ్యంలో సమంత అక్కినేని ఇంటి పేరును తొలగించడంతో వీరి విడాకుల వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరు అధికారికంగా విడాకుల ప్రకటన ఇస్తూ విడిపోయారు. అప్పటి నుంచి సమంతగానే ఈ ముద్దుగుమ్మ రెండో పెళ్లి తర్వాత తన భర్త పేరును తన పేరు పక్కన చేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం నందిని రెడ్డి డైరెక్షన్లో మా ఇంటి బంగారం సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ వీడియోకి ఎంతో మంచి ఆదరణ లభించింది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం సమంత సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Also Read; Prerana Kambam: గుడ్ న్యూస్ చెప్పిన బుల్లితెర నటి ప్రేరణ.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×