E-Paper
Advertisement

Bank Strike: ఐదు రోజుల వర్కింగ్ షెడ్యూల్.. సమ్మెతో బ్యాంకుల సేవలకు తీవ్ర అంతరాయం

Bank Strike: ఐదు రోజుల వర్కింగ్ షెడ్యూల్.. సమ్మెతో బ్యాంకుల సేవలకు తీవ్ర అంతరాయం
Advertisement

Bank Strike: వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం బ్యాంకుల సమ్మె కారణంగా హైదరాబాద్ లో బ్యాంకు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది దేశవ్యాప్తంగా నిన్న జరిగిన సమ్మెలో పాల్గొనడంతో.. హైదరాబాద్, తెలంగాణ అంతటా బ్యాంకింగ్ కార్యకలాపాలు గణనీయంగా నిలిచిపోయాయి. తొమ్మిది ప్రధాన యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU).. వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సమ్మెకు పిలుపునిచ్చింది.

గణతంత్ర దినోత్సవం, బ్యాంకుల సమ్మెతో లాంగ్ వీకెండ్ రావడంతో.. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార సంస్థలలో లావాదేవీలు స్తంభించిపోయాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ఏటీఎంలు పనిచేస్తున్నప్పటికీ, చెక్ క్లియరెన్స్‌లు, మనీ డిపాజిట్లు, అడ్మినిస్ట్రేటివ్ అప్‌డేట్‌లు వంటి వ్యక్తిగత లావాదేవీలు నిలిచిపోయాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు గలేటి నాగేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఐదు రోజుల పనిదినాలు పెండింగ్

Advertisement

అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలనే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ పెండింగ్‌లో ఉండటంతో ఈ వివాదం కొనసాగుతోంది. ఆర్‌బీఐ, ఎల్‌ఐసీ వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే ఐదు రోజుల షెడ్యూల్ ప్రకారం పనిచేస్తున్నాయని బ్యాంకు సిబ్బంది అంటున్నారు. దీంతో బ్యాంకు ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారని యూనియన్ నాయకులు వాదిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది పనిసమయం తగ్గకుండా, సోమవారం నుండి శుక్రవారం వరకు రోజువారీ పని గంటలను 40 నిమిషాలు పెంచాలని యూనియన్లు ఇప్పటికే ప్రతిపాదించాయి.

Also Read: రూ.85,920 జీతంలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే గడువు

Advertisement

ఐదు రోజుల పని దినాల అమలుకు కచ్చితమైన హామీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడంతో.. వేరే మార్గం లేక సమ్మెకు దిగామని యూనియన్ ప్రతినిధులు అంటున్నారు. ఈ సమ్మెతో ప్రైవేట్ రంగ బ్యాంకులు ప్రభావితం కానప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

Related News

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

Big Stories

Advertisement
×