E-Paper
Advertisement

IND VS NZ 4th T20: శివమ్‌ దూబే ర‌న్ ఔట్ వివాదం…కొంప‌ముంచిన‌ హ‌ర్షిత్ రాణా, టీమిండియా దారుణ‌ ఓట‌మి

IND VS NZ 4th T20:  శివమ్‌ దూబే ర‌న్ ఔట్ వివాదం…కొంప‌ముంచిన‌ హ‌ర్షిత్ రాణా, టీమిండియా దారుణ‌ ఓట‌మి
Advertisement

IND VS NZ 4th T20: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 4th T20I, ) మధ్య బుధవారం రోజున జరిగిన మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ సేనకు ఊహించని షాక్‌ తగిలింది. విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( ACA-VDCA Cricket Stadium, Visakhapatnam) వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిడియా దారుణంగా ఓడిపోయింది. ఇండియాను చిత్తు చేసిన న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన శివమ్‌ దూబేను ( Shiva Dube Run Out) అనవసరంగా రనౌట్ చేశాడు హర్షిత్ రాణా ( Harshit Rana). దీంతో 65 పరుగులు సాధించిన శివమ్‌ దూబే ( Shiva Dube ) రనౌట్ అయ్యాడు. ఈ దెబ్బకు 216 పరుగులు చేదించాల్సిన టీమిండియా 18.4 ఓవర్లలో 165 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో న్యూజిలాండ్ 50 పరుగులు తేడాతో విజయం సాధించి, టీమిండియా కు షాక్ ఇచ్చింది.

Also Read: BAN PAK – T20 World Cup: PCB తిక్క కుదిర్చిన ఐసీసీ.. టీ20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఎంట్రీ ?

శివమ్‌ దూబే ర‌న్ ఔట్ వివాదం

Advertisement

విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నాలుగవ టి20 జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఆకాశ్‌ చోప్రా చెప్పినట్లుగానే, ఫస్ట్ బౌలింగ్ చేసిన జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత‌ 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే ఏడు వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్, 215 పరుగుల భారీ టార్గెట్ ఇండియా ముందు ఉంచింది. న్యూజిలాండ్ సమిష్టిగా రాణించడంతో ఈ స్కోర్ సాధించింది. అయితే 216 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇండియన్ బ్యాటర్లు చేతులెత్తేశారు.

మరోసారి సంజు శాంసన్ 24 పరుగలకు ఔట్ కాగా, అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. రింకు సింగ్ 39 పరుగులతో రాణించగా, శివమ్‌ దూబే ఇండియాను ఆదుకున్నాడు. 23 బంతుల్లో 65 పరుగులు చేసి రఫ్ ఆడించాడు. అయితే శివమ్‌ దూబే ఊపు చూస్తే, ఇండియా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అంతలోపే హర్షిత్ రాణా కొంప ముంచాడు. ఓ చెత్త షాట్ ఆడి, శివమ్‌ దూబే ఔట్ అయ్యేలా చేశాడు. హ‌ర్షిత్ కొట్టిన స్టేట్ డ్రైవ్ ను బౌలర్ మ్యాట్ హేన్రీ ఆప‌బోయాడు. అయితే, అత‌ని చేయి తగిలి, వికెట్లను గిరాటేసింది ఆ బంతి. ఈ నేపథ్యంలో మరో ఎండ్ వైపు ఉన్న శివమ్‌ దూబే రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ మొత్తం పోయింది. 18.4 ఓవర్లలో 165 పరుగులకు అలౌట్ అయిన టీమ్ ఇండియా 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. హర్షిత్ రాణా వల్ల మ్యాచ్ ఓడిపోయిందని ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు.

15 బంతులో శివమ్‌ దూబే అర్థ సెంచరీ

Advertisement

న్యూజిలాండ్ తో జరిగిన నాలుగవ టి20 లో శివమ్‌ దూబే 15 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఫాస్టెస్ట్ అర్థ సెంచరీ చేసిన మూడవ టీమిండియా బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ లిస్టులో మొదటగా యువరాజ్ సింగ్ ఉన్నాడు. 12 బంతుల‌లో యువరాజ్ సింగ్ అర్థ సెంచ‌రీ చేయగా అభిషేక్ శర్మ 14 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు మూడవ స్థానంలో శివమ్‌ దూబే నిలిచాడు. కాగా న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య 5వ టీ20 తిర్వ‌నంత‌పూరంలో జ‌రుగ‌నుంది.

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×