BigTV English

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?
Advertisement

Mass Jathara: సినీ నటుడు రవితేజ(Raviteja) ఏ విధమైనటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నేడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా తన సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు అంటే పూర్తిగా రవితేజ కృషి, కష్టపడే తత్వం నేడు తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పాలి. రవితేజ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అనంతరం ఈయనకు స్టార్ హీరోల సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో అవకాశాలు కల్పించడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనలో ఉన్న నటనను బయటపెట్టారు.


మాస్ జాతర టైటిల్ రవితేజ ఆలోచన..

ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన రవితేజ అనంతరం హీరోగా అవకాశాలను అందుకుంటూ తనని తాను నిరూపించుకొని నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఇక పోతే రవితేజలో మరొక టాలెంట్ కూడా దాగి ఉందని తెలుస్తుంది. రవితేజ నటించిన సినిమాలకు దాదాపు ఆయనే టైటిల్స్ ఖరారు చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర (Mass Jathara)సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మాస్ జాతర అనే టైటిల్ రవితేజ చెప్పారని డైరెక్టర్ భాను భోగ వరపు(Bhanu Bhogavarapu) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

ఈ హిట్ టైటిల్స్ అన్ని రవితేజవేనా..

ఈ సినిమాకు రవితేజ గారు టైటిల్ ఇచ్చారని ఇది మాత్రమే కాదు బలుపు, క్రాక్, వంటి సినిమాలకు కూడా ఈయనే టైటిల్ సూచించారు అంటూ భాను చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇలా రవితేజ టైటిల్ సూచించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఈ క్రమంలోనే మీలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం గురించి రవితేజ మాట్లాడుతూ మనం ఇలాంటి టైటిల్స్ ఇచ్చినప్పుడు దర్శకులు కూడా ఆ టైటిల్ కి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేసుకుంటారని తెలిపారు.


అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్..

ఇక మాస్ జాతర సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని, రవితేజ అభిమానులు ఆయన సినిమాల నుంచి ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు భాను ఈ సినిమా గురించి మాట్లాడుతూ అంచనాలను పెంచేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ అలాగే ట్రైలర్ కూడా రాబోతోందని తెలిపారు. రవితేజకు జోడిగా శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ధమాకా సినిమా తర్వాత ఈగల్, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. మరి మాస్ జాతర ఎలా ప్రేక్షకులను సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Raviteja -Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Related News

Pawan Kalyan: పవన్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన దిల్ రాజు .. ఫస్ట్ టైం ఆ పాత్రలో పవర్ స్టార్?

Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ పోస్ట్ పై సమంత కామెంట్స్.. రిలేషన్ బయట పెట్టినట్టేనా?

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Big Stories

×