E-Paper
Advertisement

సమంత బిడ్డకు పేర్లు పెట్టిన నెటిజన్..సామ్ క్రేజీ రియాక్షన్!

సమంత బిడ్డకు పేర్లు పెట్టిన నెటిజన్..సామ్ క్రేజీ రియాక్షన్!
Advertisement

Samantha: టాలీవుడ్ సీనియర్ నటి సమంత అతి త్వరలోనే తల్లిగా ప్రమోట్ కానున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న సమంత నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలతో పాటు తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఈమె కొద్ది రోజులలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో తన మాతృత్వం గురించి సమంత నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు.

సమంత బిడ్డకు పేరు పెట్టిన అభిమాని..

ఇకపోతే ఇటీవల సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని మీ పిల్లలకు ఎలాంటి పేరు పెట్టబోతున్నారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ పేరు పెట్టడం నిజంగా చాలా కష్టతరమైన పని. తన బిడ్డకు పేరు పెట్టే విషయంలో మీ సహాయం కూడా కావాలి అంటూ అభిమానులను కోరిన సంగతి తెలిసిందే. సమంత ఇలా తన బిడ్డ పేరు విషయంలో సహాయం కోరడంతో ఒక అభిమాని సమంత బిడ్డకు పేర్లను సూచించడంతో సమంత స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

పాప పుడితే సమైరా…

Advertisement

ఒక అభిమాని సమంత బిడ్డకు పేరును సూచిస్తూ.. సమంతకు పాప పుడితే సమైరా (Samaira) అని పెట్టాలని సూచించారు. సమంత రాజ్ ఇద్దరు పేర్లు కలిసొచ్చేలా ఈ పేరును సూచించారు. అదేవిధంగా అబ్బాయి పుడితే సామ్రాజ్(Samraj) అని పెట్టమని అభిమాని కోరారు. అభిమాని తన బిడ్డకు పేర్లను సూచించడంతో వెంటనే సమంత సామ్రాజ్ అనే కామెంట్ పై స్పందిస్తూ.. మన గురించి మనమే మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అనిపించడం లేదూ? అంటూ స్మైలీ ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక సమంత ప్రెగ్నెన్సీ సమయాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈమె బేబీ బంప్ తో నిత్యం వర్కౌట్స్ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో ఏకంగా 11 కిలోల బరువు పెరిగానని ఈ అనుభూతిని బాగా ఆస్వాదిస్తున్నానని తెలిపారు. ఇక సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొద్ది రోజులపాటు ఒంటరిగా ఉన్నప్పటికీ ఈమె గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరితో ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి అయిన వెంటనే సమంత తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. సమంత పెళ్లి తరువాత మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇలా సమంత తిరిగి సినిమాల పరంగా ఫామ్ లోకి వచ్చారని అభిమానులు సంతోషించేలోపు ఈమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ మరోసారి ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ప్రకటించారు.

Also Read: సీడ్ గణేషుడి విగ్రహాన్ని లాంచ్ చేసిన చిరు.. గొప్ప సందేశం ఇచ్చిన మెగాస్టార్!

Related News

రజనీకాంత్ మూవీలో విలన్ గా తెలుగు హీరో.. మాస్ ర్యాంపేజ్ షురూ!

రోమాంచకం స్టోరీ ఇదేనా ? డేటింగ్ యాప్‌తో వచ్చిన కష్టాలు!

సీడ్ గణేషుడి విగ్రహాన్ని లాంచ్ చేసిన చిరు.. గొప్ప సందేశం ఇచ్చిన మెగాస్టార్!

ఇరగదీస్తున్న ఇరుముడి …ఈసారి మరిన్ని రికార్డుల దిశగా !

“బస్ డ్రైవర్ కొడుకు.. ఉగ్రవాది కాదు”.. ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన యశ్ తల్లి!

రేర్ పిక్.. గౌతమ్ కి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపిన మహేష్ బాబు!

సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు.. ఆ 3 డోంట్ మిస్!

Big Stories

Advertisement
×