E-Paper
Advertisement

సీడ్ గణేషుడి విగ్రహాన్ని లాంచ్ చేసిన చిరు.. గొప్ప సందేశం ఇచ్చిన మెగాస్టార్!

సీడ్ గణేషుడి విగ్రహాన్ని లాంచ్ చేసిన చిరు.. గొప్ప సందేశం ఇచ్చిన మెగాస్టార్!
Advertisement

Seed Ganesh: వినాయక చవితి పండుగ ద్వారా లోనే రాబోతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వినాయక చవితి పండుగను జరుపుకోవాలని, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలి అంటూ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పిలుపునిచ్చారు. పర్యావరణం కాలుష్యం, నీటి కాలుష్యం కాకుండా ఉండడం కోసం మట్టి విగ్రహాలను ఉపయోగించాలి అంటూ ఇదివరకు ఎంతోమంది పిలుపునిచ్చారు. అయితే తాజాగా చిరంజీవి ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపు కోసం ఈసారి అందరూ సీడ్ గణేశుడిని(Seed Ganesh) పూజించాలని కోరారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్…

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను చిరంజీవి ఆదివారం తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ముందుగా గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త సంతోష్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఓ యజ్ఞంలా భావించి ఇప్పటికే కోట్లాది మొక్కలు నాటేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారని, గ్రీన్ ఇండియా చాలెంజ్ కోసం ఆయన చేస్తున్న కృషికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

సీడ్ గణేష్ విగ్రహం నుంచి మొలకలు..

Advertisement

తాజాగా సీడ్ గణేష్ విగ్రహాలను వినాయక చవితి పండుగ సందర్భంగా పూజించి వాటిని మన ఇంటి పెరట్లోనే నిమజ్జనం చేయడం ద్వారా ఆ విగ్రహం నుంచి మొలకలు వచ్చి మనకు ఆశీర్వాదాలను అందిస్తాయని తెలిపారు.సీడ్ గణేశుడిని ఆరాధించడం ద్వారా మనకు పుణ్యం రావటమే కాకుండా ప్రకృతిని కాపాడే బాధ్యత కూడా మనకు దక్కుతుందని చిరంజీవి ఈ సందర్భంగా తెలియజేశారు. వినాయక చవితి పండుగ అంటే కాలుష్యరహిత పండుగగా నిర్వహించాలని ఉద్దేశంతో సోదర సమానుడైన సంతోష్ సీడ్ గణేశాను అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి తెలియజేశారు. ప్రస్తుతం ఈ సీడ్ గణేష్ విగ్రహాలకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి కాక..

Advertisement

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన డైరెక్టర్ బాబీ(Bobby) దర్శకత్వంలో తన 158 వ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే .తాజాగా ఈ చిత్రానికి “కాక”(Kaka) అని టైటిల్ పెట్టినట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నిర్మాణంలో కూడా చిరంజీవి మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: బాడీ షేమింగ్ ట్రోల్స్ పై సోనియా ఎమోషనల్ … చాలా అన్నారు.. కానీ?

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×