E-Paper
Advertisement

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!
Advertisement

Maruti and Hyundai 5-Star Safety Cars:  కారు కొనేటప్పుడు ధర, మైలేజ్, ఫీచర్లతో పాటు ఇప్పుడు సేఫ్టీకి కూడా వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా క్రాష్ టెస్ట్‌ లో కారు సేఫ్టీ రేటింగ్ ఎంత అనేది పరిశీలిస్తున్నారు. ఒకప్పుడు మైలేజ్, తక్కువ ధర కారణంగా ఎక్కువగా గుర్తింపు పొందిన మారుతీ సుజుకీ, టెక్నాలజీకి పేరున్న హ్యుందాయ్ సంస్థలు కూడా సేఫ్టీ విషయంలో తమ కార్లను మెరుగుపరుస్తున్నాయి. ఈ రెండు కంపెనీల నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కొన్ని మోడళ్లు ఉన్నాయి. అవేంటంటే..

మారుతీ డిజైర్

మారుతీ సుజుకీకి సంబంధించిన న్యూ జనరేషన్ డిజైర్ సేఫ్టీ విషయంలో కంపెనీకి కీలకమైన మోడల్‌గా కొనసాగుతోంది. ఇది భారత్ NCAP పరీక్షల్లో 5 స్టార్ రేటింగ్ సాధించిన మొదటి మారుతీ సెడాన్‌గా గుర్తింపు పొందింది. అంతేకాదు.. కొత్త డిజైర్ గ్లోబల్ NCAP పరీక్షలో కూడా పెద్దల సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ మోడల్‌ లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఇన్విక్టో  

Advertisement

మారుతీకి చెందిన ప్రీమియం MPV ఇన్విక్టో కూడా భారత్ t NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. మూడు వరుసల సీట్లతో వచ్చే ఈ మోడల్‌ లో 6 ఎయిర్‌ బ్యాగ్స్, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు లాంటి ఫీచర్లు ఉన్నాయి.

న్యూ బ్రెజ్జా

మారుతీ సేఫ్టీ లైనప్‌ లో కొత్త బ్రెజ్జా కూడా 5 స్టార్ భారత్ NCAP రేటింగ్ సాధించిన మోడళ్లలో చేరింది. పెద్దలతో పాటు పిల్లల రక్షణలో మంచి రేటింగ్ పొందింది.

హ్యుందాయ్ వెర్నా

Advertisement

హ్యుందాయ్ వెర్నా కూడా సేఫ్టీ విషయంలో మంచి రేటింగ్ సాధించింది. ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌ లో పెద్దలు, పిల్లల సేఫ్టీ విభాగాల్లో 5 స్టార్ రేటింగ్ పొందింది. 6 ఎయిర్‌ బ్యాగ్స్, ESC లాంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది హ్యుందాయ్ తయారు చేసిన భారతీయ మోడళ్లలో సేఫ్టీ పరంగా మంచి దూకుడు కనబర్చింది.

కొత్త వెన్యూ  

హ్యుందాయ్ కొత్త వెన్యూ కూడా 2026లో  భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ కాంపాక్ట్ SUV పెద్దల రక్షణలో 31.15/32, పిల్లల రక్షణలో 44.46/49 స్కోర్ సాధించింది. వెన్యూ‌లో 6 ఎయిర్‌ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌ గా ఉన్నాయి. హై వేరియంట్లలో ADAS, 360 డిగ్రీ కెమెరా వంటి టెక్నాలజీలు కూడా లభిస్తాయి.

Read Also: గ్లాంజా To ఇన్నోవా హైక్రాస్.. టయోటా నుంచి రాబోతున్న 3 క్రేజీ కార్లు ఇవే!

Tags

Related News

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

గ్లాంజా To ఇన్నోవా హైక్రాస్.. టయోటా నుంచి రాబోతున్న 3 క్రేజీ కార్లు ఇవే!

చేతులతో పనిలేకుండానే డిక్కీ ఓపెన్.. ఈ EV బైక్‌లో అదిరిపోయే ఫీచర్!

చిన్న EV.. పెద్ద రేంజ్.. సుజుకి e స్కై ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

సింగిల్ ఛార్జ్‌ తో 301 కి.మీ రేంజ్.. ఓలా S1Z స్కూటర్ వచ్చేసింది!

ఇండియన్ మార్కెట్‌ను షేక్ చేయబోతున్న 6 కొత్త SUVలు.. లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×