E-Paper

లైవ్ మ్యాచ్‌లో అభిమాని దొంగ‌త‌నం..గుర్బాజ్ క్యాప్ కొట్టేసి జంప్‌

లైవ్ మ్యాచ్‌లో అభిమాని దొంగ‌త‌నం..గుర్బాజ్ క్యాప్ కొట్టేసి జంప్‌
Advertisement

Fan steals Rahmanullah Gurbaz’s cap:  క్రికెట్ మ్యాచ్ లో అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయానకారంగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక కొంతమంది అభిమానులు… తమ అభిమాన క్రికెటర్ స్టేడియంలో కనిపిస్తే… రెచ్చిపోతూ ఉంటారు. మైదానంలోకి చొచ్చుకుని వెళ్లి.. సదరు క్రికెటర్ ను హగ్ చేసుకోవడం లేదా కాళ్ళు మొక్కడం చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలానే వైరల్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా లైవ్ మ్యాచ్ లో ఓ అభిమాని చేసిన పని హాట్ టాపిక్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ డేంజర్ ఆటగాడు రహ్మానుల్లాహ్ గుర్బాజ్ (Rahmanullah Gurbaz) క్యాప్ కొట్టేసి జంప్ అయ్యాడు. మొదట రహ్మానుల్లాహ్ గుర్బాజ్ ను హగ్ చేసుకున్న ఆ అభిమాని.. అనంతరం సెక్యూరిటీ రావ‌డంతో క్యాప్ (Fan steals Rahmanullah Gurbaz’s cap) తీసుకొని, ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ సంఘ‌ట‌న చూసిన క్రికెట్ ఫ్యాన్స్ తెగ న‌వ్వుకుంటున్నారు.

Also Read: Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

లైవ్ మ్యాచ్‌లో అభిమాని దొంగ‌త‌నం..గుర్బాజ్ క్యాప్ కొట్టేసి జంప్‌

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ దేశవాళీ టి20 టోర్నమెంట్ ష్పగీజా క్రికెట్ లీగ్ ( Shpageeza Cricket League 2026) ప్రస్తుతం జరుగుతోంది. టి20 ఫార్మాట్ లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రహ్మానుల్లాహ్ గుర్బాజ్ (Rahmanullah Gurbaz) కూడా ఆడుతున్నాడు. ఇందులో భాగంగానే, శుక్రవారం రోజున జరిగిన మ్యాచ్ సందర్భంగా మిస్-ఎ-ఐనక్ నైట్స్ కెప్టెన్ గా ఉన్న‌ రహ్మానుల్లాహ్ గుర్బాజ్ ఫీల్డింగ్ చేశాడు. అతనికి సాధారణంగా అభిమానులు ఎక్కువ. ఇక దేశవాళీ టోర్నమెంటులో రహ్మానుల్లాహ్ గుర్బాజ్ ఆడిన తరుణంలో… జనాలు ఎగబడి మరి ఈ మ్యాచ్ తిలకించేందుకు స్టేడియానికి వచ్చారు. ఇందులో ఓ అభిమాని, అతిగా ప్రవర్తించి వైరల్ గా మారాడు.

రహ్మానుల్లాహ్ గుర్బాజ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సదరు అభిమాని, గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో రహ్మానుల్లాహ్ గుర్బాజ్ ను హగ్ చేసుకున్నాడు. ఇంతలోనే అలర్ట్ అయిన సెక్యూరిటీ, ఆ అభిమానిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. ఇక చేసేదేమీ లేక వెంటనే రహ్మానుల్లాహ్ గుర్బాజ్ క్యాప్ ను దొంగిలించాడు ఆ అభిమాని. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోతూ సెక్యూరిటీని హేళన చేస్తూ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ పోలీసులు… భారీ ఫైన్ వేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండ‌గా, ష్పగీజా క్రికెట్ లీగ్ ( Shpageeza Cricket League 2026) లో భాగంగా మిస్-ఎ-ఐనక్ నైట్స్ జట్టు కెప్టెన్ గా వ్య‌వరిస్తున్నాడు రహ్మానుల్లాహ్ గుర్బాజ్. ఇదే జట్టులో మహమ్మద్ నబి, ముజీబ్, అప్సర్ , జద్రాన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

 

Related News

స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న బాబ‌ర్‌, రిజ్వాన్‌

ఐపీఎల్ హీరో వైభ‌వ్ కు ఘోర అవ‌మానం…చీప్ గా రూ.15 వేల‌ క‌ల‌ర్ టీవీ గిఫ్ట్

Sam Curran: స్కూల్ కు వెళ్లే బుడ్డోడిని తీసుకొచ్చి, బిల్డ‌ప్ ఇస్తున్నారు

బీసీసీఐని దెబ్బ‌కొట్టేందుకు పాక్ కుట్ర‌లు…సౌదీ అరేబియాతో క‌లిసి స్కెచ్‌

Tanveer Ahmed: మా వెధ‌వ‌ల‌ను ఇంగ్లీష్ కాస్లులతో పాటు మెంటల్ ఆస్ప‌త్రిలోనూ వేయండి

Michael Vaughan: టికెట్లు కొని సిద్ధంగా ఉన్నాం..ఇంకెన్ని రోజులు వైభవ్ ను దాస్తారు

వివాదంలో అభిషేక్ శ‌ర్మ‌..వైభ‌వ్ తో వెట్టిచాకిరీ, బ్యాట్లు మోయిస్తూ మ‌రీ !

Big Stories

×