E-Paper
Advertisement

Maa Inti Bangaram Teaser: సమంత ఈజ్ బ్యాక్.. అదరగొట్టేసింది భయ్యో!

Maa Inti Bangaram Teaser: సమంత ఈజ్ బ్యాక్.. అదరగొట్టేసింది భయ్యో!
Advertisement

Maa Inti Bangaram Teaser: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha ) రెండవ వివాహం తర్వాత తొలిసారి నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం. ఇదివరకే సమంతతో ‘ఓ బేబీ’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. సమంత భర్త రాజ్ నిడిమోరు (Raj Nidimoru) నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన సమంత లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేస్తూ.. టీజర్ డేట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మా ఇంటి బంగారం సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో సమంత యాక్షన్ పర్ఫామెన్స్ అభిమానులను మరోసారి ఆకట్టుకుంటుంది.

మా ఇంటి బంగారం సినిమా టీజర్ రిలీజ్:

ఇకపోతే తాజాగా రిలీజ్ చేసిన టీజర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో సమంత కోడలిగా అడుగు పెట్టినట్లు చూపించారు. ముఖ్యంగా అత్తవారింటితో కలిసి పోవడానికి ప్రయత్నం చేసే ఒక కోడలు రూపంలో చాలా అద్భుతంగా ఒదిగిపోయిన ఈమె.. మరొకవైపు తన యాక్షన్ పెర్ఫార్మన్స్ తో గన్నుపట్టి అదరగొట్టేసింది. సమంత ఈజ్ బ్యాక్ అంటూ సమంత అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇందులో తన పర్ఫామెన్స్ తో నెటిజన్స్ హృదయాలను కూడా దోచుకుంది సమంత. ముఖ్యంగా ఇక్కడ సమంతకు పోటీగా శ్రీముఖిని కోడలిగా ఆ కుటుంబ సభ్యులు కోరుకోవడం అసలు ట్విస్ట్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే తాజాగా మా ఇంటి బంగారం నుండి రిలీజ్ చేసిన ఈ టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

సమంత కెరియర్..

Advertisement

సమంత విషయానికి వస్తే..నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత గత ఏడాది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న ఈశా యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. హిందీలో బాలీవుడ్ వెబ్ సిరీస్ లు చేసింది. కానీ తెలుగులో సినిమాలు చేయలేదు. అందుకే ఈసారి మా ఇంటి బంగారం అనే సినిమాతో హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా సినిమా చేస్తోంది. మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇకపోతే ఇటీవల శుభం అనే సినిమాను నిర్మించి, నిర్మాతగా సక్సెస్ అయిన ఈమె.. ఇప్పుడు రీ ఎంట్రీలో కూడా మరింత సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.. ఇక అలాగే హిందీలో తన భర్త రాజ్ నిడిమోరు దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ అనే సినిమాలో నటిస్తోంది.

ALSO READ:The RajaSaab: మొత్తం చెడగొట్టార్ కదరా.. ఒక్కో పాత్రకు ఒక్కో పిచ్చి

Advertisement

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×