E-Paper
Advertisement

The RajaSaab: మొత్తం చెడగొట్టార్ కదరా.. ఒక్కో పాత్రకు ఒక్కో పిచ్చి

The RajaSaab: మొత్తం చెడగొట్టార్ కదరా.. ఒక్కో పాత్రకు ఒక్కో పిచ్చి
Advertisement

The RajaSaab: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ‘బాహుబలి’ సినిమా తర్వాత అన్నీ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన తన సినీ కెరియర్లో ఇప్పటివరకు 24 చిత్రాలు చేశారు.. అయితే ఆ 24 చిత్రాలలో నటించిన నటనను కేవలం ‘ది రాజాసాబ్’ సినిమాలోనే చూస్తారు అంటూ డిస్ట్రిబ్యూటర్ శిరీష్ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఆడియో కాల్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనికి తోడు చిత్ర బృందం, డైరెక్టర్ మారుతి (Maruthi) అందరూ కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ముఖ్యంగా తమ మాటలతో హైపిచ్చారు. కానీ థియేటర్లోకి వెళ్లిన తర్వాత పూర్తిగా కథ మారిపోయింది..

మొత్తం చెడగొట్టార్ కదరా..

ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలిసారి తన సినీ కెరియర్ లో హారర్ అండ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో నటించిన చిత్రం ది రాజా సాబ్. ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రీమియర్ షోలు మొదలవగా.. ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వాహబ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా .. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఇక భారీ స్థాయిలో అంచనాలు పెంచేసి సినిమాను రిలీజ్ చేశారు.. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అటు ప్రేక్షకుడి నుంచి వినిపిస్తున్న మాట మొత్తం చెడగొట్టారు కదరా.. తొలిసారి హారర్ కాన్సెప్ట్ లో ప్రభాస్ నటిస్తున్నారు అని తెలియడంతో అభిమానులలోనే కాదు సదరు సినీ ప్రేక్షకుడిలో కూడా అంచనాలు పెరిగిపోయాయి.. అలాంటి ఎన్నో ఆశలతో సినిమా థియేటర్కు వెళితే మాకు పిచ్చెక్కింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఒక్కో పాత్రకు ఒక్కో పిచ్చి..

Advertisement

ఇక సినిమా చూసిన వారంతా..”తాతకేమో డబ్బు పిచ్చి.. నానమ్మకి తాత పిచ్చి.. మనవడికి నానమ్మ పిచ్చి.. హీరోయిన్స్ కి హీరో పిచ్చి.. మూవీ చూసిన వాళ్లకి టోటల్గా పిచ్చి” అంటూ సినిమా నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్ ఇలా కామెంట్లు చేస్తూ.. సినిమా చూస్తే ఖచ్చితంగా పిచ్చి పట్టడం ఖాయం అనే రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే మారుతి టోటల్ గా ఆడియన్స్ కి పిచ్చి పట్టిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తుండడం గమనార్హం.

సంక్రాంతి సినిమాలు.. మొదటి సినిమాతోనే నిరాశ..

పోతే ఈసారి సంక్రాంతి సినిమాలు అన్ని మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గానే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. రాజాసాబ్ పై నమ్మకంతో కచ్చితంగా ఈ సినిమా 400 కోట్లు రాబట్టడం ఖాయమని, ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ సేఫ్ జోన్ లోకి వెళ్తుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. కానీ అందరి అంచనాలను ఈ సినిమా బోల్తా కొట్టి ఇచ్చిందనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ALSO READ:Maruthi: ఇండస్ట్రీలోకి రాకముందు రాజాసాబ్ డైరెక్టర్ ఏం చేసేవారో తెలుసా?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×