E-Paper
Advertisement

Samanth – Raj nidimoru wedding: ఇట్స్ అఫీషియల్.. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత!

Samanth – Raj nidimoru wedding: ఇట్స్ అఫీషియల్.. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత!
Advertisement

Samanth – Raj nidimoru wedding: అందరూ అనుకున్న విధంగానే సమంత(Samantha) దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) వివాహం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు అయితే నేడు ఉదయం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లోని యోగ సెంటర్ లో ఉన్న లింగ బైరవి ఆలయంలో వీరి వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి. దాదాపు 30 మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహపు వేడుక జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ సమంత మాత్రం స్పందించకపోవడంతో కొందరు ఈ వార్తలపై సందేహాలను వ్యక్తం చేశారు.

పెళ్లిపై సమంత అధికారక ప్రకటన..

ఈ విధంగా సమంత పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సమంత ఎట్టకేలకు ఈ వార్తలపై స్పందిస్తూ అధికారకంగా తమ పెళ్లి విషయాన్ని ప్రకటించారు. కాసేపటి క్రితం సమంత సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక వీరి వివాహ వేడుక సాంప్రదాయం బద్దంగా జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి వేడుకలలో సమంత ఎరుపు రంగు చీర కట్టుకొని ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఇక రాజ్ సైతం సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఇలా సమంత ఈ పెళ్లి ఫోటోలను అధికారకంగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట తెగచక్కర్లు కొడుతున్నాయి.

ఇద్దరికీ ఇది రెండవ వివాహమే..

Advertisement

ఈ క్రమంలోనే సమంత రెండోసారి పెళ్లి చేసుకోవడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక సమంతకు అలాగే రాజ్ ఇద్దరికీ ఇది రెండవ వివాహం అనే సంగతి తెలిసిందే. ఇదివరకే రాజ్ శ్యామలి దే అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు 2015లో వివాహం చేసుకున్న వీరిద్దరూ 2022వ సంవత్సరంలో విడాకులు తీసుకొని విడిపోయారు.

Advertisement

ఇక సమంత కూడా 2017 వ సంవత్సరంలో నటుడు నాగచైతన్యను ప్రేమించి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య వ్యక్తిగత భేదాభిప్రాయాలు రావడంతో 2021 వ సంవత్సరంలో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక సమంత రాజ్ నిడిమోరు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. ఇక సమంత విడాకులు తీసుకున్న తర్వాత రాజ్ తో చాలా సాన్నిహిత్యం పెరిగిందని, ఇది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు. ఇలా నేడు వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించిన నేపథ్యంలో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Samantha -Raj Nidimoru: తెలుగింటి కోడలుగా సమంత.. రాజ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×