Samantha Engagment: సినీనటి సమంత (Samantha)దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ డిసెంబర్ ఒకటవ తేదీ కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ యోగ ఆశ్రమంలో ఉన్న లింగ బైరవి ఆలయంలో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహాన్ని జరుపుకున్నారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా సమంత సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు.. ఇలా సమంత రాజ్ పెళ్లి చేసుకున్న నేపథ్యంలో వీరికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డైరెక్టర్ రాజ్ తో కలిసి నిశ్చితార్థం జరుపుకున్నారని తెలుస్తోంది.
సమంత ఫిబ్రవరి 13వ తేదీ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలలో భాగంగా ఈమె పింక్ కలర్ డ్రెస్ ధరించి ఉన్నారు. అయితే ఆమె చేతికి ఒక డైమండ్ రింగ్ కూడా కనిపించింది. ఆ రింగ్ అచ్చం పెళ్ళిలో రాజ్ సమంత వేలికి తొడిగిన రింగ్ ను పోలి ఉండటంతో సమంత రాజ్ ఫిబ్రవరి నెలలోనే నిశ్చితార్థం(Engagment) జరుపుకున్నారని అయితే ఈ విషయాన్ని సమంత రహస్యంగా ఉంచారని అభిమానులు భావిస్తున్నారు. ఇలా 10 నెలల క్రితం నిశ్చితార్థం జరుపుకున్న సమంత రాజ్ ప్రస్తుతం పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వీరిద్దరూ భూత శుద్ధి పద్ధతిలో వివాహాన్ని ఆచరించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సమంత పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు సినిమా సెలబ్రిటీలు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి సమంత రాజ్ పెళ్లి ఫోటోలతో పాటు నాగచైతన్య శోభిత పెళ్లి ఫోటోలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత తిరిగి వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన నేపథ్యంలో వీరి రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్..
ఇక సమంత రాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అదే సమయంలోనే సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడంతో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక సమంత ప్రస్తుతం ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
Also Read: Mrunal Thakur: డేటింగ్ వార్తలపై రియాక్ట్ అయిన మృణాళ్ ఠాకూర్… హాస్యాస్పదం అంటూ!