E-Paper
Advertisement

Mrunal Thakur: డేటింగ్ వార్తలపై రియాక్ట్ అయిన మృణాళ్ ఠాకూర్… హాస్యాస్పదం అంటూ!

Mrunal Thakur: డేటింగ్ వార్తలపై రియాక్ట్ అయిన మృణాళ్ ఠాకూర్… హాస్యాస్పదం అంటూ!
Advertisement

Mrunal Thakur: మరాఠీ టీవీ సీరియల్స్ ద్వారా నటిగా అందరికీ పరిచయమై ప్రస్తుతం బాలీవుడ్, సౌత్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur)ఒకరు. ఈమె ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు .అయితే ఇటీవల కాలంలో మృణాళ్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే కదా కొద్ది రోజులుగా ఈమె నటుడు ధనుష్ తో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా హీరో ధనుష్ చేసిన ఒక పోస్టుకు ఈమె రియాక్ట్ కావడంతో మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి.

పుకార్లు ఫ్రీ పీఆర్ లాంటివి..

ఈమె కేవలం హీరో ధనుష్(Danush) తో మాత్రమే కాకుండా ప్రముఖ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas iyer) తో కూడా డేటింగ్ చేస్తోంది అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మృణాళ్ ఈ రూమర్లపై స్పందిస్తూ తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈమె ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా ఆమె తన తల్లికి మసాజ్ చేయించుకుంటున్న ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటారు.. ఆ మాటలకు మేము నవ్వుకుంటాం.. పుకార్లు అనేవి ఫ్రీ పీఆర్ లాంటివి.. నాకు ఇలా ఫ్రీగా వచ్చేవి అంటే చాలా ఇష్టం అంటూ క్యాప్షన్ ఇచ్చారు..

డేటింగ్ వార్తలలో నిజం లేదు..

Advertisement

ఈ విధంగా మృణాళ్ ఠాకూర్ తన గురించి వచ్చే రూమర్లని కేవలం పుకార్లు మాత్రమేనని, తాను ఎవరితోనూ డేటింగ్ లో లేనని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. ఇకపోతే ఈమె ప్రస్తుతం సింగిల్గానే ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరియర్ పైనే పెట్టినట్లు మృణాళ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం నటుడు అడివి శేష్ తో కలసి డెకాయిట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యమైన నేపథ్యంలో మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అల్లు అర్జున్ సినిమాలో బిజీగా..

Advertisement

ఈ సినిమాతో పాటు మృణాళ్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో మృణాళ్ పాల్గొన్నారని తెలుస్తుంది ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాని 2027లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న మృణాళ్ ప్రస్తుతం కెరియర్ పై మాత్రమే ఫోకస్ పెట్టానంటూ తాజాగా మరోసారి తన గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు.

Also Read: Samantha -Raj Nidimoru: సమంత రాజ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా.. అన్నేళ్లు చిన్నదా?

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×